నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, తాజాగా భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. బాలయ్యకు దాదాపు 30 ఏళ్ల తర్వాత మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో హ్యాట్రిక్ ఆయన ఖాతాలో పడింది. ఈ మూడు సినిమాలు కూడా 50 రోజుల సెంటర్లో రికార్డులు బ్రేక్ చేశాయి. అఖండ, వీరసింహారెడ్డి సెంచరీలు కొట్టగా… ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా కూడా సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది.
ఈ మూడు సినిమాలు కూడా బాలయ్య కంచుకోట అయిన రాయలసీమలో రికార్డులు బ్రేక్ చేసి షేక్ చేశాయి. సీడెడ్‌లోని నంద్యాలలో ఈ మూడు సినిమాల వసూళ్లలో బాలయ్య వీరంగం ఆడేశాడు. ఈ మూడు సినిమాలు రు. 70 లక్షల వసూళ్లు రాబట్టాయి. అఖండ కేవలం రు. 70, 100 టిక్కెట్ రేట్లతో రు. 69 లక్షలు రాబట్టింది. వీరసింహారెడ్డి రు. 145 టిక్కెట్ రేటుతో రు. 94 లక్షల గ్రాస్ కొల్లగొట్టింది.
తాజాగా భగవంత్ కేసరి సినిమా రు. 110 టిక్కెట్ రేటుతో 75 లక్షలు కొల్లగొట్టింది. ఇలా నంద్యాల సిటీలో వరుసగా మూడు సినిమాలు 50 రోజులు ఆడడంతో పాటు ప్రతి సినిమా 70 లక్షల రూపాయల వసూళ్లు రాబట్టడం నిజంగా సెన్షేషన్. ఇలా వరుసగా మూడు సినిమాలతో అటు రు. 50 రోజులు, ఇటు రు. 70 లక్షల రూపాయలు కొల్లగొట్టిన ఘనత బాలయ్యకే దక్కింది.
ఇలాంటి రేర్ రికార్డ్ నంద్యాల సెంటర్లో ఏ టాలీవుడ్ హీరోకు లేదు. సీడెడ్‌లో బాలయ్యకు ఇలాంటి సెంటర్లు చాలానే ఉన్నాయి. ఏదేమైనా ఈ రికార్డ్‌ను వరుసగా ఏ హీరో కూడా క్రాస్ చేస్తాడని ఊహించుకోవడమే అత్యాశ అవుతుంది.