Newsబాల‌య్య ' భ‌గ‌వంత్ కేస‌రి ' 50 రోజుల సెంట‌ర్ల లిస్ట్‌......

బాల‌య్య ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ 50 రోజుల సెంట‌ర్ల లిస్ట్‌… ఈ షాకింగ్ చూశారా…!

ప్ర‌స్తుతం ఓ సినిమా థియేట‌ర్ల‌లో ఎంత పెద్ద హిట్ అయినా ప‌ట్టుమ‌ని రెండు వారాలు ఆడ‌ట్లేదు. అయితే బాల‌కృష్ణ న‌టించిన గ‌త మూడు సినిమాలు థియేట‌ర్ల‌లోనూ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు 50, 100, 150, 175 రోజులు సులువుగా ఆడేస్తున్నాయి. అఖండ 100కు పైగా కేంద్రాల్లో 50 రోజులు ఆడ‌డంతో పాటు ఒక థియేట‌ర్లో 200 రోజులు కూడా ఆడింది. వీర‌సింహారెడ్డి కూడా ఒక థియేట‌ర్లో 175 రోజులు ఆడింది. ఇక ఇప్పుడు భ‌గ‌వంత్ కేస‌రి వంతు వ‌చ్చింది.

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి థియేట‌ర్ల‌లో సూప‌ర్ హిట్ అయ్యింది. అటు అమొజ‌న్ ఫ్రైమ్‌లో వ‌చ్చి అక్క‌డ కూడా రికార్డుల దుమ్ము దులిపేస్తోంది. తాజాగా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. భ‌గ‌వంత్ కేస‌రి మొత్తం 15 సెంట‌ర్ల‌లో 50 రోజులు ఆడితే.. అందులో 11 డైరెక్ట్ సెంట‌ర్లు, మ‌రో 4 షిఫ్టింగ్ కేంద్రాలు ఉన్నాయి.

మ‌ద‌న‌ప‌ల్లి – హిందూపురం – ధ‌ర్మ‌వ‌రం – తాడిప‌త్రి – క‌ర్నూలు – నంద్యాల – ఆళ్ల‌గ‌డ్డ – జ‌మ్మ‌ల‌మ‌డుగు – చిల‌క‌లూరిపేట – ఏలూరు – గాజువాకలో డైరెక్టుగా 50 రోజులు ఆడిన ఈ సినిమా గుంత‌క‌ల్లు, అనంత‌పురం, ఎమ్మిగనూరు, ఖ‌మ్మంలో షిఫ్ట్‌లో 50 రోజులు ఆడింది. ఈ 15 కేంద్రాల‌లో బాల‌య్య కంచుకోట అయిన రాయ‌ల‌సీమ‌లోనే ఎక్కువ కేంద్రాలు ఉన్నాయి.

ఉత్త‌రాంధ్ర నుంచి వైజాగ్ గాజువాక‌, ఏలూరు, ఆ త‌ర్వాత చిల‌క‌లూరిపేట ఉన్నాయి. ఇక తెలంగాణ మొత్తం మీద ఒక్క ఖ‌మ్మంలో మాత్ర‌మే 50 రోజులు ఆడింది. మిగిలిన కేంద్రాలు అన్నీ కూడా సీడెడ్‌లోనే ఉన్నాయి. ఇక భ‌గ‌వంత్ కేస‌రి సీడెడ్‌లోనే కొన్ని చోట్ల 100 కేంద్రాలు ఆడ‌నుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా మ‌రోసారి సీడెడ్ బాల‌య్య కంచుకోట అని ఫ్రూవ్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news