టాలీవుడ్ ఇండట్రీలో యాక్షన్ చిత్రాలకి పెట్టింది పేరు బి గోపాల్. మరీ ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణ తో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్ఠించాయి. లారీ డ్రైవర్, సమ్రసింహారెడ్డి, నరసింహనాయుడు..ఇలా బాలయ్య-బి గోపాల్ కాంబినేషన్ కి ఓ క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్ అంటే అటు ఇండస్ట్రీలో ఇటు అభిమానుల్లో ప్రేక్షకుల్లో కొన్ని లెక్కలుంటాయి.
అలాంటి బి గోపాల్ మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర లాంటి సెన్షనల్ హిట్ ని కూడా తీసి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సాధించాడు. కానీ, ఆయన ప్రభాస్, గోపీచంద్ లాంటి హీరోలకి మాత్రం హిట్స్ ఇవ్వలేకపోయాడు. ప్రభాస్, ఆర్తీ అగర్వాల్ జంటగా అడవిరాముడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మొదలైనప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చ జరిగింది.
ప్రభాస్‌తో సినిమా అనగానే ఆయన పేదనాన్న కృష్ణంరాజు కూడా బి గోపాల్ తో ప్రత్యేకంగా చర్చించాడు. అయితే, ఈ సినిమాకి ముందు నిర్మాత ఆనం గోపాల్ కృష్ణ రెడ్డి. ఈయన ఒకప్పుడు నైజాంలో పెద్ద డిస్ట్రిబ్యూటర్. దిల్ రాజు కంటే ముందు ఈయన డిస్ట్రిబ్యూటర్ గా హైదరాబాద్ లో ఒక వెలుగు వెలిగాడు. కర్తవ్యం, ఎర్రసైన్యం, చీమలదండు, జెంటిల్ మేన్ ..ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. చిరంజీవితో పులి అనే సినిమాను నిర్మించారు.
ఆయనే మళ్ళీ చాలాకాలానికి ప్రభాస్‌తో సినిమా నిర్మించారు. కానీ, మాట్లాడితే కథ గురించి పట్టించుకోకుండా డబ్బులు కావాలని ఇబ్బంది పెట్టారట బి గోపాల్. సీన్ కూడా తప్పు తప్పుగా తీశాడట. ఇవన్నీ దగ్గరుండి చూసిన ఆనం గోపాలకృష్ణ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అదే సినిమా చంటి అడ్డాల టేకప్ చేసి భారీ నష్ఠాలతో అడ్రస్ లేకుండా పోయాడు.