నందమూరి బాలకృష్ణ సీనియర్ దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఐదు సినిమాలు వస్తే నాలుగు సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు. రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్ సూపర్ హిట్ సినిమాలు. కాగా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా పలనాటి బ్రహ్మనాయుడు మాత్రమే పరాజయం పాలయ్యింది.
ఇక ఇప్పుడు కూడా బి.గోపాల్ – బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే టాలీవుడ్ లో మామూలు అంచనాలు ఉండవు. ఇక దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా క్రియాటిని ఏకంగా ఆస్కార్ అవార్డ్ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత రాజమౌళి సొంతం. 22 సంవత్సరాల కెరీర్‌లో ఒక్క అపజయం అన్నదే లేకుండా రాజమౌళి వరుస సూపర్ డూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. విచిత్రం ఏంటంటే రాజమౌళి – బాలయ్య కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే రాజమౌళి శిష్యుడు బాలయ్యను డైరెక్ట్ చేయటం విశేషం.
అటు బాలయ్యకు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన బి.గోపాల్ శిష్యుడు, ఇటు రాజమౌళి శిష్యులు ఇద్దరూ బాలయ్యతో తీసిన రెండు సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. బి.గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన స్వర్ణ సుబ్బారావు.. బాలయ్య హీరోగా విజయేంద్ర వర్మ సినిమాను తెరకెక్కించారు. 2003 ఫిబ్రవరి 23న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.. అప్పటి టిడిపి మంత్రి అయ్యన పాత్రుడు.. బాలయ్య పై క్లాప్ ఇచ్చారు. రెండేళ్ళపాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 2004 డిసెంబర్లో ప్రేక్షకులు ముందుకు వచ్చి డిజాస్టర్ అయ్యింది. బాలయ్యకు జోడిగా సంగీత, లయ, అంకిత హీరోయిన్లుగా నటించారు.
బాలయ్య ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక రాజమౌళి శిష్యుడు మహదేవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ బాలయ్యతో 2009లో మిత్రుడు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ ఈ సినిమా బాగున్నా.. బాలయ్య ఇమేజ్‌కు తగిన కథ కాదు. దీంతో ఇది కూడా ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది. అలా టాలీవుడ్ లోనే తిరుగులేని స్టార్ డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు అగ్ర దర్శకుల, శిష్యులుతో బాలయ్య చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.