మెగాస్టార్ చిరంజీవి అంటే దర్శకనిర్మాతలని బాగానే శాసించే స్థాయి. ఏ టెక్నీషియన్ ని అయినా వద్దు అని క్షణాల్లో సినిమా నుంచి తపించవచ్చు. అప్పటికీ ఇప్పటికీ ఇదే రేంజ్ మేయిన్‌టైన్ చేస్తున్నారు. ఈ తరం హీరోలందరికీ ఆయన ఓ రోల్ మోడల్. వరుసగా మెగాస్టార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపవుతూ వస్తున్నాయి. అయినా ఆయన రేంజ్ కి తగ్గ సినిమాలు కమిటవుతున్నారు.
ఇక చిరంజీవి సినిమా అంటే మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన డాన్సుల కోసం సంగీత దర్శకులు కొత్త తరహా ట్యూన్స్ కంపోజ్ చేస్తుంటారు. దానికి తగ్గట్టు లిరిక్స్ ఓవరాల్ గా పాటకి తగ్గట్టుగా కొరియోగ్రాఫర్స్ డాన్స్ మూవ్‌మెంట్స్ కంపోజిషన్ ఉంటుంది. అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. చిరంజీవి సాంగ్ కి సంబంధించిన ట్యూన్ విని ఓకే అంటే తప్ప సాంగ్ రెడీ కాదు.
అలాంటిది ఓ సారి దేవీశ్రీప్రసాద్ కేవలం 6 అంటే 6 ట్యూన్స్ చిరంజీవికి పంపించారు. సాధారణంగా మెగాస్టార్ అంటే ఛాయిస్ కాదు ఆప్షన్స్ ఉంటాయి. పది నుంచి 15 ట్యూన్స్ పంపిస్తే వాటిలో నాలుగు లేదా అయిదు ట్యూన్స్ ఫైనల్ చేస్తారు. కానీ, దేవీ ఆ సమయంలో చాలా బిజీ. పైగా కథ విన్న తర్వాత అన్నయ్య సినిమా అంటే ఇలాంటి ట్యూన్స్ మాత్రమే కావాలని..6 మాత్రమే పంపారట.
అయితే, ఎన్ని ట్యూన్స్ పంపాడు..అని అసిస్టెంట్ ని అడిగితే, ఎంత పొగరు..ఒక్కటి కూడా బాగాలేదని వెనక్కి పంపాపుతాను అని మనసులో అనుకొని 6 ట్యూన్స్ విన్నారట. కానీ, ఒక్క ట్యూన్ కూడా రిజెక్ట్ చేసేలా లేదని చిరంజీవి శంకర్ దాదా ఎం ఎం బి బి ఎస్ సినిమా ఆడియో ఫంక్షన్ లో అందరి ముందు ఒప్పుకున్నారు. దటీజ్ రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్.