టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా దేవర. టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివకు ఆచార్య రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కొరటాల శివ.. ఇప్పుడు ఎన్టీఆర్ తో కసితో దేవర సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తానేంటో ప్రూవ్ చేసుకోవాలని భారీ పాన్ ఇండియా సినిమాగా దేవరను తెరకెక్కిస్తున్నాడు. దేవర రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
జనవరి మొదటి వారంలో జరిగే షెడ్యూల్లో ఎన్టీఆర్‌పై రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేశారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్ల కోసం ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఒక రేంజ్లో ఈ ఫైట్లు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. గోవాలో సముద్రం ఒడ్డున వేసిన స్పెషల్ సెట్స్ లో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఈ రెండు యాక్షన్ సీక్వెన్స్‌లలో ఒకటి నైట్ ఎఫెక్ట్ లో వస్తుందని.. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.
దేవరలో ఎమోషన్ తో పాటు యాక్షన్ హైలెట్‌గా మాస్కు పిచ్చెక్కిపోయేలా కొరటాల చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏప్రిల్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించడంతో.. కొరటాల అస్సలు గ్యాప్ లేకుండా లెంగ్తీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఈ సినిమాపై అంచనాలకు మామూలుగా లేవు. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.