నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. బాలయ్యకు 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన ఫీట్ దక్కింది. ఈ ఏడాది సంక్రాంతి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో రెండు వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో పోటీపడిన వీర సింహారెడ్డి.. సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
బాలయ్య కెరీర్ లోనే ఎప్పుడు లేనట్టుగా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.54 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఇది నిజంగా సెన్సేషనల్ విజయం అని చెప్పాలి. ఇక బాలయ్యకు కంచుకోట అయిన రాయలసీమలో ఈ మూడు సినిమాలు అదిరిపోయే వసూళ్ళు రాబట్టాయి. అఖండ ఒక కర్నూలు జిల్లాలోనే ఏకంగా మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 200 రోజులు ఆడింది. వీరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని.. ఆలూరు.. శ్రీ లక్ష్మీ నరసింహ థియేటర్ లో సెంచరీ కొట్టింది.
తాజాగా భగవంత్ కేసరి సినిమా కూడా కొన్ని కేంద్రాలలో అర్థ సెంచరీ కొట్టి, చిలకలూరిపేటలో సెంచరీ దిశగా దూసుకు వెళుతుంది. ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన వీరసింహారెడ్డి 365 రోజుల దిశగా దూసుకు వెళుతుంది. ఆలూరు లోని శ్రీ లక్ష్మీనరసింహ థియేటర్లో ఈ సినిమా ఇప్పటికీ 320 రోజులు పూర్తి చేసుకుంది. వచ్చే సంక్రాంతి వరకు ఈ సినిమా థియేటర్లలో ఆడితే ఏడాది పాటు ఆడిన అరుదైన రికార్డు బాలయ్య ఖాతాలో పడుతుంది.
ఇప్పటికీ బాలయ్య ఖాతాలో సింహ, లెజెండ్ లాంటి సినిమాలు గతంలో ఎన్నో సినిమాలు 365 రోజులు ఆడాయి. ఇప్పుడు మరోసారి వీరసింహారెడ్డి ఈ అరుదైన రికార్డు నమోదు చేయబోతోంది. టాలీవుడ్ లో ఒక హీరో నటించిన ఇన్ని సినిమాలు 365 రోజులు ఆడిన రికార్డులు ఎవ్వరికీ లేవు. ఈ విషయంలో నటసింహం బాలయ్య దరిదాపుల్లో కూడా ఏ హీరో లేరని చెప్పాలి.