ఇప్పుడు ఎక్కడ చూసినా సరే “యానిమల్” సినిమా పేరే మారుమ్రోగిపోతుంది .స్టార్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వగా దర్శకత్వంలో రష్మిక మందన్నా- రన్బీర్ కపూర్ నటించిన సినిమానే ఈ యానిమల్ . కొన్ని కొన్ని సినిమాలు ఫలానా డైరెక్టర్లు తెరకెక్కిస్తేనే బాగుంటుంది . అందరిలాగా లవ్-సస్పెన్స్ – రొమాంటిక్ డ్రామాలు తెరకెక్కించడం సందీప్ రెడ్డి వంగకి చేతకాదు. నాలుగు సంవత్సరాలకి ఒక్క సినిమా తెరకెక్కించిన అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కిస్తాడు.
ఆ సినిమాతో పది కాలాలపాటు ఇండస్ట్రీలో తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకుంటాడు . అలాంటి తెరకెక్కించాడు యానిమల్ పేరుతో సందీప్ రెడ్డివంగా ఈ సినిమాని. కొద్దిసేపటి క్రితం యానిమల్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది . సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . సీన్స్ – పాటలు – రొమాంటిక్ డైలాగ్స్.. భార్య భర్తల బంధం మరీ ముఖ్యంగా ఒక కొడుకు తండ్రి గురించి ఎలా ఫీలవుతాడు ..తండ్రి కోసం ఏం చేస్తాడు.. చిన్నతనం నుంచి ఎంగేజ్ వరకు ఆ తర్వాత పెద్దయ్యాక ఎలా ఉంటుంది..? ఆయన మనసు ..అనేది క్లియర్గా చూపించాడు.
రన్బీర్ కూడా విజృంభించేశాడు. రన్బీర్ కపూర్ ఇనేళ్లల్లో తాను నటించిన సినిమాలలో 100% నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . రష్మిక మందన్నా కూడా తనదైన స్టైల్ లో ఈ సినిమాను ముందుకు నడిపించింది. కాగా సినిమా మొత్తం చాలా కూల్ గా సాఫీగా సాగిపోతూ ఉంటుంది . అయితే ఇంటర్వెల్ ముందుకు వచ్చే ఒక సీన్ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ కుర్రాళ్లకు సైతం దడ పుట్టించేస్తూ ఉంటాయి. గన్ కల్చర్ ని బాగా ఎంకరేజ్ చేస్తూ టూ మచ్ వయసు పెట్టాడు సందీప్ రెడ్డివంగా . పక్కాగా చెప్పాలంటే కొన్ని కొన్ని సీన్స్ లో కుర్రాళ్ళకి సైతం సీట్లు తడిసిపోవాల్సిందే ..ఆ రేంజ్ లో వైలెన్స్ ఎంకరేజ్ చేశాడు . దీంతో అనిమల్ సినిమాపై మరిన్ని పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి . చూద్దాం మరి మొదటి రోజు యానిమల్ ఎలాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొడుతుందో..?