Newsఅనిల్ రావిపూడి ఆ మిస్టేక్ చేసివుంటే ' భ‌గ‌వంత్ కేస‌రి '...

అనిల్ రావిపూడి ఆ మిస్టేక్ చేసివుంటే ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ఖ‌చ్చితంగా ఫ్లాప్ అయ్యేదా.. ఆ సీక్రెట్ ఇదే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన సినిమా భగవంత్‌ కేసరి. దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే వైవిధ్యమైన సినిమాగా నిలవడంతో పాటు బాలయ్యకు వరుసగా మూడో హిట్ సినిమాగా నిలిచింది. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తాజాగా 50 రోజుల పూర్తి చేసుకుంది. ఇటు అమెజాన్ ప్రైమ్ లో కూడా దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే సినిమాకు రివ్యూ ఇవ్వటంలో సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దారి వేరు.

సినిమా రన్ పూర్తి అయిపోయిన తర్వాత ఆయన ఓటీటీలో సినిమా చూసి చాలా డీటెయిల్‌గా రివ్యూ ఇస్తూ ఉంటారు. సినిమాకు ఏం చేశారు ? ఏం చేయకుండా ఉండాల్సింది.. ఏం చేయకపోవడం ? వల్ల సినిమాకు ఆ ఫలితం వచ్చింది.. అన్నది క్లియర్గా చెబుతూ ఉంటారు. తాజాగా భగవంత్‌ కేసరి సినిమాకు కూడా ఆయన రివ్యూ ఇచ్చారు. ఈ సినిమా రివ్యూ గురించి ఆయన చెబుతూ స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి క‌బ‌డ్డీ ఆడుకున్నారు అంటూ గోపాలకృష్ణ ప్రశంసల‌ వర్షం కురిపించారు.

సినిమాలో కూతురు సెంటిమెంట్ మెయిన్ హైలెట్గా ఉండటం కలిసి వచ్చిందని.. బాలకృష్ణ – కాజల్‌ మధ్య ప్రేమను సెకండరీగా చూపించి శ్రీలీల.. బాలయ్య మధ్య కూతురు సెంటిమెంటు మెయిన్‌గా చూపించటంతో సినిమాకు చాలా ప్లస్ అయిందని పరుచూరి చెప్పారు. రొటీన్ కి భిన్నంగా అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే తో సినిమాను ఇంకాస్త అందంగా తీర్చిదిద్దారు అంటూ మెచ్చుకున్నారు. ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణను అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు. ఈ సినిమాలో హీరో పాత్రను నేలకొండ భగవంత్‌ కేసరి ఎన్బికె గా సెట్ చేయడంలోనూ అనిల్ రావిపూడికి మంచి మార్కులు పడ్డాయి అన్నారు.

తన జీవితాన్ని జైలు పాలు చేసిన విలన్లను హీరో చంపేయటాన్ని కథగా చూపిస్తే ఈ సినిమా అంత సక్సెస్ అయ్యేదే కాదని.. అలా కాకుండా తాను పెంచుతున్న అమ్మాయి శ్రీలీలని ఆమె తండ్రి ఆశయం కోసం మిలటరీకి పంపించాలనే నేపథ్యాన్ని సినిమాలో మెయిన్ గా హైలెట్ చేయడంతో సినిమాకు కొత్తదనం వచ్చిందని పరుచూరి చెప్పారు. సెకండ్ హాఫ్ లో కొంత ట్రిమ్ చేయాల్సిందని.. సినిమాని రెండున్నర గంటలుగా ఉండి ఉంటే వసూళ్లు ఇంకా బాగుండేవ‌ని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఏది ఏమైనా కథను రొటీన్ గా కాకుండా కూతురు సెంటిమెంట్‌తో నడిపించడం ఈ సినిమాకు చాలా ప్లస్ అయిందని.. ఫైనల్ గా పరుచూరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news