Newsఅమితాబ్ కి లిప్ కిస్ పెట్టాలి అని.. రెండు సార్లు...

అమితాబ్ కి లిప్ కిస్ పెట్టాలి అని.. రెండు సార్లు బ్రెష్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటుడిగా ఎలాంటి రికార్డ్స్ సాధించారో అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో ఆయనని ఎంత ఘోరంగా అవమానించారో తెలిస్తే ఇప్పుడు వాళ్ళని నరికేయాలనిపిస్తుంది. డాన్ లాంటి సినిమా ఎన్నిసార్లు ఎంత స్టార్ హీరోతో రీమేక్ చేసినా అమితాబ్ ని కొట్టలేరని ప్రూవ్ అయింది. సర్కార్ చేసినా, బుడ్డా హోగా తేరే బాప్ చేసినా అమితాబ్ లెవల్స్ వెరే.

ఒకదశలో పూరి జగన్నాద్ కథ విన్న తర్వాత రామూజీ ఈ సీన్ లో అలా కాకుండా ఇలా ఉంటే బావుంటుందేమో..? అని ఆర్జీవీ దగ్గర సందేహాలను వ్యక్తపరిచారు. దానికి ఆర్జీవీ చెప్పిన సమాధానం…ఒకవేళ ఈ సినిమా హిట్ అయిందనుకోండి..అమితాబ్ ఇంతకన్నా పైకి వెళ్ళడానికి ఏముంది..ఒకవేళ సినిమా దొబ్బింది..అమితాబ్ ఇంతకన్నా కిందకి వెళతాడా..? వాడేదో మీ ఫ్యాన్..మీతో సినిమా చేయాలని వచ్చాడు.

వాడ్ని పట్టుకొని డౌట్లు గివుట్లు అంటారు..అని పూరిని తీసుకొని వెళ్లిపోయారు ఆర్జీవీ. ఆ తర్వాత బుడ్డా టైటిల్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. అలాంటి బిగ్ బి తనకంటే వయసులో చాలా చిన్న అమ్మాయి..అది కూడా అంధురాలైతే పసితనం నుంచీ అన్నీ ఆయనే నేర్పించి క్లైమాక్స్ లో నాకు అన్నీ నేర్పించావు ముద్దు కూడా ఎలా ఉంటుందో తెలియాలి..అనే మాట అడిగితే..దానికి ఇచ్చే ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్ ఒక్క అమితాబ్ మాత్రమే ఇవ్వగలడని నిరూపించారు.

ఆ సినిమా బ్లాక్. 2005లో వచ్చిన ఈ సినిమాకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. రాణీ ముఖర్జీ ఇందులో అమితాబ్ పాటు నటిచింది. ఈ సినిమాలో ముద్దు ఎలా ఉంటుందో క్లైమాక్స్ లో అమితాబ్ ని అడిగి పెట్టుకుంటుంది. ఆ సీన్ తర్వాత అమితాబ్ రాణిని వదిలి వెళ్లిపోతాడు. ఈ సీన్ షూట్ చేసిన రోజు రెండుసార్లు బ్రెష్ చేసుకున్నానని, ఎంతో భయం వేసిందని రాణి ఓ సందర్భంలో తెలిపింది. అంటే ముద్దు సన్నివేశాలలో ఉండే అసౌకర్యాన్ని చెప్పకనే చెప్పింది రాణి ముఖర్జీ.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news