Newsకాపీ క్యాట్ థ‌మ‌న్ : అల వైకుంఠ‌పురంలో ట్యాన్ ఎత్తి ఓ...

కాపీ క్యాట్ థ‌మ‌న్ : అల వైకుంఠ‌పురంలో ట్యాన్ ఎత్తి ఓ మై బేబీ దించేశాడు…!

థ‌మ‌న్ వ‌రుస‌ అవకాశాలు నేపథ్యంలో అటుపక్క ఎంత స్టార్ హీరో సినిమా చేస్తున్న కూడా శ్రద్ధతో ట్యూన్లు కంపోజ్ చేస్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఇప్పటికే కాపీ క్యాట్ అన్న ముద్ర వేసుకున్నాడు. అయితే అఖండ, భగవంత్‌ కేసరి, అలవైకుంఠపురంలో లాంటి కొన్ని సినిమాలను పక్కన పెడితే.. మిగిలిన సినిమాలుకు థ‌మ‌న్ అందిస్తున్న మ్యూజిక్ ఏ మాత్రం ఆసక్తిగా లేదు. అసలు ఒక్కటంటే ఒక్క సాంగ్‌ కూడా వినాలనిపించేలా ఉండటం లేదు. తాజాగా థ‌మ‌న్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాలో పాటలపై ఒక రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి.

గతంలో వీరిద్దరూ కలిసి క్రియేట్ చేశారు. దీంతో తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలు, ఆ సినిమాల్లోని పాటలపై అంతకు మించిన అంచనాలు ఉంటాయి. అది సహజం. అయితే అలాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా.. అంటే అది అంత సులువు కాదు. ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. గుంటూరు కారం సినిమాకు ఉన్న బజ్‌ వల్ల అలవైకుంఠపురంలో సినిమాతో ఎక్కువగా కంపేరిజన్ చేయాల్సి వస్తోంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఆ సినిమా పాటలు బ్లాక్ బస్టర్. ఇవన్నీ త్రివిక్రమ్ రేంజ్‌ను ఒక స్థాయికి తీసుకువెళ్లాయి. దాంతో పట్టే థ‌మ‌న్ రేంజ్ కూడా పెరిగిపోయింది.

ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు థ‌మ‌న్ – త్రివిక్రమ్ కలిసి పనిచేస్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, పాటలు.. టీజర్ లో చూస్తుంటే ఆ మ్యాజిక్ ఇద్దరు రిపీట్ చేయలేకపోతున్నారు. దమ్ మసాలా పాట వచ్చింది.. ధూమ్‌ మ‌చారే అన్న పాటను గుర్తుచేసేలా ఉంది. జనం సరిపెట్టుకున్నారు. తాజాగా ఓ మై బేబీ పాట వచ్చింది. ఈ పాట మీద చాలా అంటే చాలా అసలు ఉన్నాయి. కానీ పాట ఆ రేంజ్‌లో లేదు. మహేష్ బాబు అభిమానులే పూర్తిగా డీలా పడ్డారు.

సోషల్ మీడియాలో థ‌మ‌న్ మీద ఒక రేంజ్‌లో ట్రోలింగ్ మొదలైంది. అలవైకుంఠపురంలో రాములో రాములా సాంగ్ స్టైల్ లోనూ కొన్ని బిట్లు కూడా కాపీ కొట్టేసి ఓ మై బేబీ ట్యూన్ చేసినట్టుగా క్లియర్‌గా తెలుస్తోంది. ఇక మిగిలిన ఆశ గుంటూరు కారం సినిమాలో ఉన్న మాస్ సాంగ్.. ఈ పాట కచ్చితంగా ఓ లెవెల్ లో ఉండి తీరాలి. లేకపోతే సినిమా మీద ఉన్న హైప్‌ అంతా రిలీజ్ కి ముందే చప్పబడిపోతుంది అనటంలో సందేహం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news