రాముడు పేరుతో అనేక చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో రాముడు ట్యాగ్‌లో దాదాపు 30 సినిమాలువచ్చాయని అంటారు. వీటిలో మెజారిటీ సినిమాలు అన్నగారు ఎన్టీఆర్ నటించా రు. దొంగరాముడు, డ్రైవర్ రాముడు, అడవిరాముడు, టైగర్ రాముడు.. రాముడు-భీముడు.. ఇలా అనేక సినిమాల్లో ఆయన నటించారు. అయితే.. అక్కినేని నాగేశ్వరరావు మాత్రం అందాల రాముడు సినిమాలో నటించారు.
ఈ సినిమా సూపర్ హిట్ ఆడింది. ఇక, ఎన్టీఆర్ నటించిన.. అన్ని రాముడి సినిమాలు కూడా ఇదే తరహా లో హిట్టయ్యాయి. అయితే.. ఇన్ని సినిమాలకు రాముడి ట్యాగ్ తగిలించడాన్ని అక్కినేని పెద్దగా ఇష్టపడ లేదు. అందుకే.. తన సినిమాల్లో ఒకటి రెండు రాముడు ట్యాగ్ ఉండేలానే ఇష్టపడ్డారు. కానీ, అన్నగారు ఎన్టీఆర్ మాత్రం అనేక సినిమాలకు రాముడి పేరును తగిలించుకున్నారు. దీనిపైనే ఓ సందర్భంలో అక్కినేని సటైర్లు వేశారు.
ఇన్ని రాముళ్లు ఉండరు మాస్టారు. ఒక్కడే రాముడు. కావాలంటే.. కృష్ణుడికి తగిలించుకోండి
అని వ్యాఖ్యానించారు. ఇక, ఆ తర్వాత రెండు మూడు సినిమాలు ఇదే తరహాలో వచ్చాయి. కానీ, రాముడు ట్యాగ్ కు ఉన్నంత ఆదరణ.. ఈ కృష్ణుడి ట్యాగ్‌కు లభించలేదు. అంతేకాదు.. ఈ సినిమాలు పెద్దగా లాభం కూడా తీసుకురాలేదు. దీంతో మళ్లీ రాముడి బాటాలోనే ఎక్కువగా ఇండస్ట్రీ నడిచింది. కానీ, అక్కినేని సూచనలతో ఎన్టీఆర్ తర్వాత.. తర్వాత.. రాముడి ట్యాగ్‌ను దాదాపు తగ్గించేశారు.