Newsదర్శకుడిగా మారి చేతులు కాల్చుకుంటున్న రచయిత..ఇన్ని ఫ్లాపులు పడిన బుద్ధి రాలేదా...

దర్శకుడిగా మారి చేతులు కాల్చుకుంటున్న రచయిత..ఇన్ని ఫ్లాపులు పడిన బుద్ధి రాలేదా ..?

వక్కంతం వంశీ..సురేందర్ రెడ్డి చేసే సినిమాలకి దాదాపు కథ అందించేది ఆయనే. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. వక్కంతం వంశీ ప్రముఖ నవలా రచయిత అయిన వక్కంతం సూర్యనారాయణరావు కొడుకు. ముందుగా హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

అలాగే కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు. ప్రముఖ యాంకర్ అయిన సుమ కనకాల ఇందులో హీరోయిన్. వీరిద్దరు కెరీర్ మొత్తంలో హీరోహీరోయిన్స్ గా నటించిన సినిమా ఇదొక్కటే. తర్వాత సుమ ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ సినిమా డిజాస్టర్. అయితే, వక్కంతం వంశీ తర్వాత రచయితగా కిక్ సినిమాకి పనిచేశారు.

ఈ సినిమా రవితేజ కెరీర్ లో మాత్రమే కాదు, ఇలియాన, సురేందర్ రెడ్డి, వక్కంతం కెరీర్ లోనూ బెస్ట్ సినిమా. ఆ తర్వాత అశోక్, అథిది, రేసుగుర్రం, ఎవడు, ఊసరవెల్లి, టెంపర్, టచ్ చేసి చూడు, కిక్ 2 లాంటి సినిమాలకి రచయితగా పనిచేశారు. అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ చిత్రాలకి కథ దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా చేసిన సినిమాలు ఆయనకి చేదు అనుభవాన్ని ఇచ్చాయి.

కానీ, రచయితగా పనిచేసిన సినిమాలలో ఎక్కువ సూపర్ హిట్స్ ఉన్నాయి. కిక్, అశోక్, రేసుగుర్రం, ఎవడు, టెంపర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్నాయి. రచయితగా వక్కంతం వంశీకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇటీవల వచ్చిన నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ సినిమాతో అందరూ ఆయనని దర్శకత్వం కంటే కథా రచయితగానే కంటిన్యూ అయితే బావుంటుందని సలహా ఇస్తున్నారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news