ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య త్వరలోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడ..? అంటే ఎస్ అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . దానికి కారణం 2024లో జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి విజయం సాధిస్తుంది అని పోల్స్ చెప్తూ ఉండడమే .
టిడిపి విజయం సాధించాక కచ్చితంగా మంత్రి పదవిని తీసుకుంటాడు బాలకృష్ణ . అప్పుడు ఆయన సినిమాలో చేసే అంత టైం ఉండకపోవచ్చు . పూర్తి కాన్సన్ట్రేషన్ ప్రజాసేవపైనే పెట్టాలి అనుకుంటున్నారట. అప్పుడు సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పక తప్పదు . అయితే ఆయన గుడ్ బై చెప్పినా సరే ఆయన వారసుడు తెరంగేట్రం మాత్రం కన్ఫామ్ చేసే విధంగానే ప్లాన్ చేస్తున్నారట .
ఆయన ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్న మూమెంట్ లోనే తన కొడుకుని ఇండస్ట్రీలో దింపే ప్రయత్నాలు చేస్తున్నాడట బాలకృష్ణ . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఓ పక్క మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఫిక్స్ అయినందుకు ఆనందపడాలో.. లేకపోతే బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి నిర్ణయం తీసుకున్నారని బాధపడాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్..!!