కొందరు చిన్న వయస్సులోనే సినిమాల్లోకి వచ్చి ఒకటి రెండు సినిమాలతోనే సూపర్ పాపులర్ అవుతారు. ఆటైంలో వచ్చిన క్రేజ్ నిలబెట్టుకోలేక ఏదో ఒక వివాదంలో చిక్కుకుని త్వరగానే ఇండస్ట్రీ నుంచి ఫేడవుట్ అవుతారు. పై ఫొటోలో కనిపిస్తోన్న ఆ అమ్మాయి కూడా బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
ఆ తర్వాత ఆమెకు కాలం కలిసి రాలేదు. వరుస ప్లాపులతో ఫేడవుట్ అయిపోయింది. చివరకు విలాసవంతమైన వృత్తికోసం వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆమె ఎవరో కాదు వర్థమాన హీరోయిన్ శ్వేతాబసుప్రసాద్. వరుణ్ సందేశ్ కొత్తబంగారు లోకం సినిమాతో యూత్ గుండెల్లో గిలిగింతలు పెట్టేసింది. ఏక్కడా అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌కు తెలుగు కుర్రకారు ఫిదా అయిపోయింది.
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో నిర్మించిన ఈమె సినిమాల కోసమే ఫ్యామిలీతో సహా ముంబైకు వచ్చేసింది. ఈమె పేరు శ్వేత, తల్లిపేరులోని బసు, తండ్రిపేరులోని ప్రసాద్ యాడ్ చేసుకోవడంతో ఆమె పేరు శ్వేతాబసుప్రసాద్ అయ్యింది. ఛాన్సులు రాక హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. దీంతో కొన్నాళ్ల పాటు జైలులో కూడా ఉంది.
దీంతో ఆమె కెరీర్ దెబ్బతింది. టాలీవుడ్ జనాలు ఆమెను చూసే తీరులో మార్పు వచ్చేసింది. ఆ తర్వాత 2018లో రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుని యేడాదికే విడాకులు ఇచ్చేసింది. ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అవుదాం అనుకుంటున్నా ఆమెను ఎవ్వరూ తీసుకోవడం లేదు. దీంతో ఓటీటీలో చిన్న చిన్న ఛాన్సులతో సరిపెట్టుకుంటోంది.