మెగా హీరో వరుణ్ తేజ్ – సొట్ట బుగ్గల సుందరి హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఐదారు సంవత్సరాలగా ప్రేమించుకుని తాజాగా ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి రిసెప్షన్ నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో జరిగింది. అయితే ఈ రిసెప్షన్ జరిగిన తీరు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పాలి. ఇది ఓ హీరో పెళ్లి రిసెప్షన్. అది కూడా మెగా ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో పెళ్లి ఫంక్షన్ అంటే ఎంత హడావుడి ఉండాలి.. హీరో శర్వానంద్ పెళ్లి ఫంక్షన్ జరిగింది.
ఇక్కడ ఈ ఇద్దరు హీరోల పెళ్లి ఫంక్షన్ల మధ్య ఎందుకు ? కంపారిజన్ అంటే.. ఇద్దరు టాలీవుడ్ లో మిడిల్ రేంజ్ హీరోలే పైగా వరుణ్ తేజ్‌కు మెగా హీరో అన్న బ్రాండ్ కూడా ఉంది. శర్వానంద్ ఫంక్షన్‌కు ఇండస్ట్రీ సెలబ్రిటీలు, పొలిటికల్ సెలబ్రిటీలు క్యూ కట్టారు. వరుణ్ ఫంక్షన్ కు అసలు ఇండస్ట్రీ జనాలే చాలామంది మొహం చాటేశారు. టాలీవుడ్‌లో చిన్నాచితక ఫంక్షన్ అంటే చాలు వాలిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు.
ఇక మెగా ఫ్యామిలీ నుంచి పవన్ రాలేదు. ఆయన ఎప్పుడూ బిజీగానే ఉంటారు. విచిత్రంగా చాలామంది దర్శకులు కూడా ఈ ఫంక్షన్‌కు రాలేదు. వరుణ్ తేజ్ తో పనిచేసిన దర్శకులు కూడా డుమ్మా కొట్టేశారు.
పిలుపు చాలా లేదా అన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నాగబాబు ఆయన భార్య కొంతమందిని స్వయంగా పిలిచారని.. కొంతమందికి ఫోన్లు.. మరికొందరికి వాట్సాప్ లో ఇన్విటేషన్ పంపించారట.
డైరెక్ట్ గా ఆహ్వానం అందని వాళ్లు ఈ ఫంక్షన్‌ను లైట్ తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలామంది దర్శకులు కూడా రాకపోవడం అన్నది ఇప్పుడు పాయింట్‌గా మారింది. ఏది ఏమైనా ఈ ఫంక్షన్ మెగా ఫ్యామిలీ రేంజ్‌కి తగినట్టుగా లేదని ఎక్కువ మంది అంటున్నారు. మరి లోపం ఎక్కడ జరిగిందో వాళ్లకే తెలియాలి.