హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. వీరిద్దరూ భార్యాభర్తలు అయ్యారు. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే వరుణ్ తేజ్ అవ్వాలి.. లేకపోతే లావణ్య త్రిపాఠి అవ్వాలి.. అయితే వీళ్ళిద్దరూ కాకుండా పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజ్నోవా హైలైట్ అవుతున్నారు. ఎస్ ఇది నిజం. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు కూడా దూరంగా ఉంటున్నాడు అంటూ రకరకాల పుకార్లు.. రాజకీయ విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు మూడో భార్య అన్నాను వెంటేసుకుని ఇటలీలో తన అన్న కొడుకు వరుణ్ పెళ్లికి వెళ్ళాడు. శంషాబాద్ విమానాశ్రయంలో పవన్ – అన్నా ఇద్దరు కలిసి కనిపించారు. ఇటీవల కాలంలో పవన్ అభిమానులు కూడా పవన్ ను భార్య అన్నాతో కలిసి చూడలేదు. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందంటూ వస్తున్న ప్రచారానికి సరైన కౌంటర్ లేకుండా పోయింది. ఎప్పుడు అయితే ? శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయో పవన్ అభిమానులు ఈ ఫోటోలను విపరీతంగా ట్రెండింగ్ చేస్తున్నారు.
విచిత్రం ఏంటంటే చాలా రోజుల తర్వాత పవన్ మూడో భార్య అన్న ఫోటో బయటకు వచ్చింది. అసలు ఆమెను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. గతంతో పోలిస్తే బాగా లావు ఎక్కిపోయింది.. పవన వెనకాల ఆమె పెద్ద ఆంటీలా ఉందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. వైట్ షర్ట్.. బ్లూ కలర్ ఫ్యాంట్ వేసుకున్న అన్నా గత రూపానికి ఇప్పటికీ అస్సలు సంబంధం లేదు.
50 సంవత్సరాల పైబడి వయసు ఉన్న ఆంటీ ఆకారం ఎలా ? ఉంటుందో అన్నా ఆకారం కూడా అలాగే కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అటు పవన్‌తో పాటు ఇటు అన్నా ఫోటో కూడా బాగా హైలెట్ అవుతుంది.