Newsవరుణ్-లావణ్య జంటగా కొత్త సినిమా స్టార్ట్...!

వరుణ్-లావణ్య జంటగా కొత్త సినిమా స్టార్ట్…!

ఆరేళ్లపాటు ప్రేమలో మునిగితేలి ఎట్టకేలకు ఇటలీలో రీసెంట్గా పెళ్లి బంధంతో ఒకటయ్యారు. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి. దంపతులయ్యాక ఈ జంట తొలిసారిగా ఓ కార్యక్రమంలో సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ఇద్దరు కలిసి హాజరయ్యారు. యొదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎల్ఎల్‌పీ, శ్రీ రాధా దామోదర స్టూడియోస్ బ్యానర్లపై పద్మజా కొణిదల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. హీరో వరుణ్ తేజ్ క్లాప్‌ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుమల గౌరవ దర్శకత్వం వహించ‌గా నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ యూనిట్ కి అందించారు.

ఈ సినిమా నిర్మాత నిహారిక మాట్లాడుతూ.. మా బ్యానర్లో ఇప్పటివరకు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిం చేశాం.. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ ప్రారంభించాం.. కొత్త వాళ్ళతో సినిమా చేయడం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను అని చెప్పారు. పెళ్లి తర్వాత వరుణ్ – లావణ్య తొలిసారిగా బయట జంటగా కనిపించడంతో మెగా అభిమానులు, సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫోటోలకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక పెళ్లి తర్వాత అటు వరుణ్ – ఇటు లావణ్య ఇద్దరు కూడా ఎవరి కెరీర్ పరంగా వారు బిజీ కానున్నారు. ఇలా పెళ్లి త‌ర్వాత వాళ్ల కొత్త లైఫ్ సినిమా స్టార్ట్ కాబోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news