సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొన్ని పాత వార్తలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి . అభిమానులు తమ హీరోలపై ఉన్న ప్రేమతో గతంలో హీరోలకు సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు . రీసెంట్గా అదే లిస్టులోకి వస్తుంది ఈ వార్త . ప్రజెంట్ సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఉపాసనలకు సంబంధించిన ఓ వార్త యమహాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
ఉపాసన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే . మొదటి నుంచి సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు. అయితే ఉపాసన – చరణ్ కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉండింది . ఆ సినిమా మిస్ అయింది. ఆ సినిమా చేయడం ఉపాసనకు ఇష్టం లేదు . ఆ కారణంగానే ఆమె రిజెక్ట్ చేసింది. ఆ సినిమా మరేదో కాదు చరణ్ మూవీ చిరుత.
పూరి జగన్నాథ్ కొత్త హీరోయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ డెబ్యూ బాధ్యతలను పూరి జగన్నాధ్ చేతిలో చిరంజీవి పెట్టగా ..అప్పటికే ఉపాసనల ప్రేమాయణం గురించి పూరి జగన్నాథ్ కు తెలుసు . ఆ కారణంగానే ఈ సినిమాలో ఉపాసనని హీరోయిన్గా పెడదామనుకున్నారట పూరి జగన్నాథ్ . అయితే ఉపాసన ఒప్పుకోలేదట. సినిమా ఇండస్ట్రీలో నటించడం తనకు ఇష్టం లేదు అంటూ తెగేసి చెప్పేసిందట. దీంతో ఆమె ఇష్టం గౌరవిస్తూ ఈ సినిమాలో వేరే హీరోయిన్ ని చూస్ చేసుకున్నారు మేకర్స్. ప్రెసెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది..!!