Moviesబిగ్ షాకింగ్: లాస్ట్ మినిట్ లో ఊహించని కంటెస్టెంట్ ని ఎలిమినేట్...

బిగ్ షాకింగ్: లాస్ట్ మినిట్ లో ఊహించని కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసి పడేసిన బిగ్ బాస్.. ఎంత దారుణం అంటే..?

బిగ్ బాస్ .. ఈ పేరు చెప్తే పొగిడే జనాల కన్నా బూతులు తిట్టే జనాలు ఎక్కువ . అసలు బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఎప్పుడు నడుచుకుంది లేదు అంటూ కొట్టి పడేస్తూ ఉంటారు అభిమానులు . ప్రజల చేత ఓటింగ్స్ వేయించుకుని డబ్బులు లాక్కోవడం తప్పిస్తే ఏనాడైనా జెన్యూన్ గా ఓటింగ్ ప్రకారం నువ్వు ఎలిమినేట్ చేసావా ..? కంటెస్టెంట్లని అంటూ ఫ్యాన్స్ డైరెక్ట్గా అడిగిస్తున్నారు .

అయితే ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ నేను నాకు నచ్చినట్లే చేస్తా అంటాడు బిగ్ బాస్ . ఇప్పుడు కూడా అదే చేశాడు. ఇన్ని సీజన్స్ లో ఎప్పుడు ఫేర్ ఎలిమినేషన్ చేసింది లేదు . ఈసారి కూడా అంతే బిగ్ బాస్ తనకు నచ్చిన వాడిని ఇంట్లో పెట్టుకుని నచ్చని వాళ్ళని తరిమేస్తున్నారు. ఈసారి అందరికన్నా లీస్ట్ ఓట్స్ తెచ్చుకున్న శోభా శెట్టిని సేవ్ చేసి సెకండ్ లీస్ట్ స్థానంలో ఉన్న భోలేను ఎలిమినేట్ చేసేసాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం టాప్ కంటెస్టెంట్ గా ఉన్న బోలె ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది . నిజానికి ఓట్ల ప్రకారం శోభాశెట్టికి చాలా తక్కువ వచ్చాయి. కానీ ఆమె హౌస్ లో నుంచి వెళ్ళిపోతే కంటెంట్ ఇచ్చే వాళ్ళు లేరు అని భయంతో బిగ్ బాస్ భోలేను తరిమేసి శోభాను సేఫ్ చేశాడట . దీంతో మళ్లీ బిగ్ బాస్ పై బూతులు తిడుతున్నారు జనాలు. నీకు ఇష్టం వచ్చిన వాడిని ఎలిమినేట్ చేసుకునేటప్పుడు .. మమ్మల్ని ఎందుకు ఓట్లు వేయమని అడుగుతావు అంటూ పచ్చి బూతులు తిడుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news