పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా నిండా పాన్ ఇండియా స్టార్లే ఉండడంతో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి దిగుతుందా అని ఒకటే ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న రిలీజ్ కావలసిన సలార్ కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 22 కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తో పాటు కేజీఎఫ్‌తో తానేంటో ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి.
దీనికి తోడు కేజీఎఫ్ సిరీస్, కాంతారా లాంటి సినిమాలు నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ సంస్థ బడ్జెట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా సలార్ తెరకెక్కిస్తోంది. ఇటు ప్రమోషన్లు ఎలా చేయాలన్న ప్లానింగ్ జరుగుతోంది. అటు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేస్తున్నారు. సలార్ 1 లో కొన్ని అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని తెలుస్తోంది. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం జీపులు, ట్రక్కులు, ట్యాంకులు సహా 750 కు పైగా వాహనాలు ఉపయోగించినట్టు తెలుస్తోంది.
భారతదేశ సినిమా చరిత్రలోనే ఒక ఫైట్ కోసం ఈ రేంజ్ లో ట్యాంకులు, జీపులు వాడిన సినిమా ఏదీ లేదని.. ఒక అద్భుతమైన యాక్షన్ సన్నివేశాన్ని మనం తెరపై చూడబోతున్నామని.. హాలీవుడ్ సినిమాలలో భారీ యాక్షన్స్ సన్ని వేశాల కోసం ఇంత రిస్క్ చేసినట్టు తెలుస్తోంది. సలార్ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ భారీ యుద్ధ భూమిని నిర్మించాడట. ఇక ఈ సినిమాకు సెక్వెల్ కూడా 6 నెలల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
పార్ట్ 2 ను ఏప్రిల్ 2024 లో వేసవి సెలవులు కానుకగా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. సలార్ పార్ట్ వన్ టైటిల్స్ ఎండ్ కార్డులో పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ ? అనేది ప్రకటిస్తారని కూడా సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సలార్ 1 పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక షారుక్ ఖాన్ నటించిన డుంకి సినిమా కూడా అదే టైంలో విడుదల కానుంది.