మాటల మంత్రికుడు త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. గతంలో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు. అతడు సినిమా నిర్మాత మురళీమోహన్ కు లాభాలు రాలేదు. ఖలేజా బాక్సాఫీస్ దగ్గర బాల్చి తన్నేసింది. ఈ రెండు సినిమాలు బుల్లితెరపై సక్సెస్ అయ్యాయి.. అది వేరే విషయం. 13 సంవత్సరాల తర్వాత మళ్లీ సూపర్ స్టార్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది అంటే త్రివిక్రమ్ ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా తీయాలి..!
కానీ త్రివిక్రంలో అవేవీ కనిపించడం లేదు. అజ్ఞాతవాసి సినిమా టైంలో పవన్ కళ్యాణ్ తాను కలిసి సినిమా చేస్తే ఎలా ? ఉన్నా ప్రేక్షకులు వేలంవెర్రీగా చూస్తారు అన్న గర్వంతో త్రివిక్రమ్ ఆ సినిమా తీశాడని చాలామంది అన్నారు. ప్రేక్షకులు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాను నేలకుపెట్టి కొట్టే శారు. త్రివిక్రమ్ పొగరు అంతా నేల మీదకు పడిపోయిందన్న విమర్శలు వచ్చేసాయి. ఆ సినిమాతో అంతకుముందు త్రివిక్రమ్ సంపాదించుకున్న పేరు అంత గంగ పాలయ్యింది.
మధ్యలో ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వటంతో అరవింద సమేత – బన్నీతో అలవైకుంటపురంలో సినిమాలు హిట్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్ తనంతటివాడు లేడు అన్న భావనకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇగోతో పడలేకే ఎన్టీఆర్ మరో ఛాన్స్ ఇచ్చి కూడా పక్కకు తప్పుకున్నాడు. వెంటనే త్రివిక్రమ్ – మహేష్ బాబును బుట్టలో పడేసాడు. ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలో అజ్ఞాతవాసి సినిమా టైములో త్రివిక్రమ్ ఎంత గర్వభంగంతో వ్యవహరించారో అలాగే ముందుకు వెళుతున్నట్టుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేపు సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ అవుతుందా ? ఫట్ అవుతుందా అన్నది తర్వాత విషయం.. కానీ సినిమా తెరకెక్కించే విషయంలో చాలాసార్లు ఆలస్యం అవ్వడం హీరోతో అంత సఖ్యత ఉన్నట్టు అనిపించకపోవడం.. మ్యూజిక్ డైరెక్టర్ హీరోయిన్ల విషయంలో హీరోతో పట్టు పట్టడం అనుకున్న స్థాయిలో ప్రమోషన్లు ప్రారంభం కాకపోవటం ఇవన్నీ ఈ సినిమాపై హైప్ తగ్గించేస్తున్నాయి.
అదే బన్నీతో జులాయి – సన్నాఫ్ సత్యమూర్తి – అలవైకుంఠపురంలో లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు త్రివిక్రమ్ తెరకెక్కించాడు. ఆ మూడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తతో వెళ్లినట్టు అనిపిస్తుంది. ఎందుకో గాని బన్నీ సినిమాలపై త్రివిక్రం పెడుతున్న శ్రద్ధ.. మహేష్ సినిమాలపై పెడుతున్నట్టుగా లేదు. బన్నీతో మూడు సూపర్హిట్లు ఇచ్చాడు. మహేష్ తో ఇప్పటికే చేసిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. పైగా మహేష్ మూడో ఛాన్స్ ఇస్తే చాలా పర్ఫెక్ట్ గా ఈ సినిమాను తెరకెక్కించాల్సింది పోయి షెడ్యూల్స్ ఆలస్యం చేసుకోవడం చివరకు… కథ, కథనాల విషయంలోనూ హీరోని సరిగా మెప్పించలేకపోవడం ఇవన్నీ చూస్తుంటే మహేష్ మీద ఎందుకో త్రివిక్రమ్ ఆ ప్రేమ, ఆ కాన్‌సంట్రేషన్ చూపించనట్టుగానే కనిపిస్తోంది. అన్నట్టు మరో విషయం గుంటూరు కారం ఇప్పటకీ కూడా సంక్రాంతికి వస్తుందంటే చాలా మంది ఇండస్ట్రీ జనాలే నమ్మట్లేదు. అది త్రివిక్రమ్ పనోడితనం మీద ఉన్న నమ్మకం..!