Newsటాలీవుడ్‌లో విషాదం.. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల న‌టుడు మృతి

టాలీవుడ్‌లో విషాదం.. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల న‌టుడు మృతి

టాలీవుడ్ లో నిన్నటికి నిన్న జూనియర్ బాలయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. మిచిగాన్‌లోని తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా గత నెల 31 మృతి చెందారు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది.

ఈశ్వర రావు స్వర్గం నరకం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆయన తన కెరీర్ మొత్తం మీద 200కు పైగా సినిమాలలో నటించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తొలి సినిమా స్వర్గం నరకంతో సూపర్ హిట్ అందుకున్న ఆయన. కాంస్య నంది అవార్డు అందుకున్నారు.

ఆ తర్వాత ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో ఈశ్వరరావు నటించారు. దేవతలారా దీవించండి, ఏఎన్ఆర్ బ్లాక్ బస్టర్ ప్రేమాభిషేకం, యుగ పురుషుడు, దయామయుడు, మెగాస్టార్ బ్లాక్‌బ‌స్టర్ ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి వంటి విజయవంతమైన సినిమాలలో ఈశ్వరరావు చివరిసారిగా చిరంజీవి – నగ్మా నటించిన ఘరానా మొగుడు సినిమాలో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news