తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులలో చాలా మంది తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. చాలా సినిమాలు చేసీ మంచి గుర్తింపు పొందిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు.. అయితే అలా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని అతి తక్కువ సమయంలోనే ఫెడౌటుగా మారిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ రచన బెనర్జీ కూడా ఒకరు.
ముందుగా బెంగాలీ సినిమాలలో ఇమే హీరోయిన్గా నటించిన రచన ఆ తర్వాత పాపులర్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నిన్ను ప్రేమిస్తున్నాను అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయమయ్యింది. ఆ వెంటనే బాలయ్యతో సుల్తాన్, చిరంజీవితో కలిసి బావగారు బాగున్నారా అనే సినిమాలో నటించి మరింత గుర్తింపు సంపాదించుకుంది. అలా సినిమాలు చేస్తున్న సమయంలో వివాహం చేసుకొని తన భర్తతో ఏర్పడిన కొన్ని సమస్యల వల్ల ఈమె విడాకులు తీసుకోవడం జరిగింది.
దీంతో ఆమె మైండ్ సెట్ పూర్తిగా మారిపోయి మద్యానికి బానిసగా మారిపోయిందట.. షూటింగ్ కి సైతం మందు తాగేసి వచ్చి అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు మందు సిగరెట్లు తాగుతూ నిర్లక్ష్యంగా ఉండేదట. దీనివల్ల రచన బిహేవియర్ కరెక్ట్ కాదని అక్కడ ఉన్న దర్శక నిర్మాతాలు ఉద్దేశించి మీకు సినిమా అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారట. ఇలా క్రమంగా ఈమె సినీ ఇండస్ట్రీకి దూరమైందని సమాచారం.
వాస్తవానికి ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించినప్పటికీ ఈమె చేసిన పని వల్ల ఈమెకు అవకాశాలు తగ్గిపోయి ఈమె ఇమేజ్ను కాపాడుకోలేకపోయింది రచన. అయితే ఇండస్ట్రీలలో కేవలం రచనా లాంటివారు చాలామంది ఉన్నారు మొదట మంచి పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత చెడు అలవాట్లకు బానిసై కెరియర్ని నాశనం చేసుకున్నారు.