Newsమంచి మ్యూజిక్ ఇస్తున్నా అనూప్‌కు టాలీవుడ్ ఎందుకు ఛాన్స్ ఇవ్వ‌ట్లేదు... అస‌లేం...

మంచి మ్యూజిక్ ఇస్తున్నా అనూప్‌కు టాలీవుడ్ ఎందుకు ఛాన్స్ ఇవ్వ‌ట్లేదు… అస‌లేం జ‌రిగింది…!

తెలుగులో ఓ పదేళ్ళపాటు కంటిన్యూగా సంగీతం అందించే సంగీత దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. మణిశర్మ సైతం అవకాశాలు లేక ఖాళీగా ఉన్న రోజులున్నాయి. తప్పని పరిస్థితుల్లో చిన్న సినిమాలకి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన రోజులున్నాయి. ఇస్మార్ట్ శంకర్ లాంటి సాలీడ్ మ్యూజికల్ హిట్ తర్వాత మణిశర్మ మళ్ళీ ఫాంలోకి వచ్చారు.

కొత్త సంగీత దర్శకులు వస్తున్న కొద్దీ ఒక్కోసారి బడ్జెట్ కారణంగా సీనియర్ సంగీత దర్శకులకి అవకాశాలు కరువవుతున్నాయి. అయితే, ఏ ఆర్ రెహమాన్ మాదిరిగా మన సౌత్‌లో ఆస్కార్ అందుకునే స్థాయి ఎవరికీ ఉండటం లేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంఎం. కీరవాణి అందుకున్నారు. ఇక కొత్తగా వస్తున్న సంగీత దర్శకులు మ్యూజికల్ గా హిట్ ఇస్థున్నప్పటికీ దర్శకనిర్మాతలకి ఛాయిస్ ఎక్కువవడం వల్ల ఆశించినంత కాలం కొనసాగలేకపోతున్నారు.

ప్రస్తుతం ఎక్కువగా హవా నడిస్తున్న సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్. ఇంట్లో బయటా కాపీ క్యాట్ అని పేరున్నా అవకాశాలకేమీ తక్కువలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ ఎక్కువగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇండస్ట్రీలో ఆవురావురంటూ పెద్ద సినిమా కోసం ఎదురుచూస్తున్న సంగీత దర్శకుల్లో అనూప్ రుబెన్స్ ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

తేజ ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన అనూప్ చాలా తక్కువ సమయంలోనే 50 సినిమాలకి సంగీతం అందించాడు. ఇప్పుడు ఆ నంబర్ కూడా పెరిగింది. కానీ, ఉన్నపలంగా అనూప్ కి మంచి సినిమాలు చేసే ఛాన్స్ రావడం లేదు. నాగార్జున, పూరి జగన్నాథ్ లాంటి పెద్దవాళ్ళు అనూప్ కి పిలిచి మరీ సినిమాలిచ్చారు. మనం లాంటి క్లాసిక్ అనూప్ ఖాతాలో ఉండటం ఎంతో గొప్ప విషయం. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకనో రేస్ లో ఇప్పుడు వెనకబడిపోయాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news