తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాధవీలత ఓ హాట్ టాపిక్. కర్నాటక బల్లారికి చెందిన మాధవీలత చిన్న వయసులోనే హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే, ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. మాధవీలత హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా నచ్చావులే. ఈ సినిమాకి దర్శకుడు రవిబాబు. ఆయనతోనే మాధవీలత కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కున్నానని ఓపెన్ గా చెప్పింది.
అదే మాధవీలతకి ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా చేసింది. నచ్చావులే తర్వాత నానితో స్నేహితుడా సినిమా చేసింది. ఇందులో అందాలను ఆరబోసింది. కానీ, సినిమా డిజాస్టర్ అయింది. అప్పటికే పగపట్టిన రవిబాబు మాధవీలతకి అవకాశాలు రాకుండా చేశాడు. ఇది స్వయంగా ఆమె పేరు చెప్పకుండా చెప్పిందే. అమ్మాయిల పిచ్చి ఉందని ఓపెన్ అయింది. అప్పుడే కాదు, ప్రతీసారి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది.
అయితే, మాధవీలత మాత్రమే కాదు, రవిబాబు వల్ల భూమిక కూడా ఇబ్బందులు ఎదుర్కుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. భూమిక కి ఖుషి సినిమా తర్వాత టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఒకదశలో స్టార్ హీరోయిన్గా సౌత్ లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. మిస్స్మ్మ లాంటి సినిమా భూమిక కి మంచి పేరు తెచ్చింది.
ఆ రకంగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనసూయ చేసి ఆకట్టుకుంది. అయితే, ఈ మూవీ సమయంలో దర్శకుడు రవిబాబు భూమికను బాగానే ఇబ్బంది పెట్టాడట. కానీ, ఎప్పుడు దీనిగురించి భూమిక బయటకి చెప్పలేదు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గి ఆ తర్వాత ఎం సి ఏ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చినా కూడా రవిబాబుతో జరిగిన ఇబ్బందిని చెప్పలేదు. అది భూమిక గొప్పతనం..!