Moviesఅది అసలు సంగతి.. మంగళవారం సినిమాకి చిరు-బన్నీ సపోర్ట్ చేస్తుంది అందుకేనా..?...

అది అసలు సంగతి.. మంగళవారం సినిమాకి చిరు-బన్నీ సపోర్ట్ చేస్తుంది అందుకేనా..? అందరు అజయ్ కోసం అనుకునేశారుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్..తాజాగా నటిస్తున్న సినిమా మంగళవారం . ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటుంది మూవీ టీం.

కాగ నవంబర్ 11వ తేదీ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరగబోతుంది . ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే మంగళవారం సినిమా చాలా చిన్నది ..లోటు బడ్జెట్ మూవీ కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎందుకు ఇంత సపోర్ట్ వస్తుంది అని.. ఆరా తీయగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది .

ఈ చిత్రం నిర్మాత స్వాతి రెడ్డి చిరు కూతురు శ్రీజ కి మంచి జాన్ జిగిడి ఫ్రెండ్.. ఆ కారణంగానే చిరంజీవి ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా షూటింగ్స్ లో బిజీగా ఉన్న శ్రీజ కోసమే ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. స్వాతి రెడ్డి మరెవరో కాదు .. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . నిమ్మగడ్డ ప్రసాద్ కి మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే . ఆ కారణంగానే చి రంజీవి – అల్లు అర్జున్ ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news