టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ నేడు ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తెలుగు తమిళంలో హీరోగా ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన .. ఎన్నో అవార్డులను అందుకున్న ఆయన ..వయోభారంతో గత కొంతకాలంగా బాధపడుతూ ఉన్నారు. ఇటీవల గుండెకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటూ వచ్చాడు .
కాగ నవంబర్ 11న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు . దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ నివాళులు ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ రాజకీయ ప్రముఖులంతా చంద్రమోహన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. చంద్రమోహన్ మరణించడంతో ఆయన కెరీర్ ని, గతంలో చెప్పిన విషయాలని అభిమనులు నెమరు వేసుకుంటున్నారు.
1966 లో రంగులరాట్నం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రమోహన్.. ఆ తర్వాత ఎన్నో ఎన్నో మంచి సినిమాలో నటించి.. సినిమా ఇండస్ట్రీకి హిట్స్ అందించారు. అంతేకాకుండా టాలీవుడ్ ఇందస్ట్రీకి విశేష సేవలు కూడా అందించారు . ఆయన కేవలం సీనియర్స్ తోనే కాదు..ఈ తరం హీరోలతో కూడా నటించారు. ఆయన లాస్ట్ గా నటించిన సినిమా గోపీచంద్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచిన ఆక్సిజన్ మూవీ . ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉండిపోయారు . అలా ఈయన తెర పై కనిపించిన లాస్ట్ సినిమా ఆక్సీజన్ గా చరిత్రలో మిగిలిపోయింది..!!