ఒకప్పుడు మహేష్ బాబుకు వరుసగా సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్‌లు ఇచ్చాడు థమన్. అసలు మహేష్ సినిమా అంటే థమన్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టమని చెప్పేవాడు. అయితే రెండేళ్ల క్రితం సంక్రాంతికి అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమాలో పాటలు పూర్తిగా రిలీజ్ అయ్యాయి. అప్పుడు బన్నీ సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఎంతో పెద్ద ప్లస్ అయ్యింది. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వటంలో సగం క్రెడిట్ థమన్‌కే ఇవ్వాలి.
మహేష్ సరిలేరుకు మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ పరమ రాడ్ కంపోజింగ్ ఇచ్చాడు. దీంతో మహేష్ థమన్పై నమ్మకంతో సర్కారు వారి పాట సినిమాకు ఛాన్స్ ఇస్తే ఆ సినిమా ఆల్బమ్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా పూర్తిగా తేలిపోయింది. మహేష్ సైతం థమన్ అవుట్ ఫుట్ పై చాలా అసహనం వ్యక్తం చేశాడు. దేవిశ్రీని కాదని థమన్‌కు పట్టు పట్టి ఛాన్స్ ఇస్తే థమన్ అసలు ఏ మాత్రం కాన్సన్ట్రేషన్ చేయలేదని కూడా మహేష్ ఫీలైనట్టు ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీనికి తోడు తమ ఔట్‌ఫుట్ ఇచ్చే విషయంలో చాలా లేట్ తీసుకుంటున్నాడు.
ఇటీవల పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయడం లేదన్న విమర్శలు ఇండస్ట్రీలో ఉండనే ఉన్నాయి. ఇక గుంటూరు కారం సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టే విషయంలో మహేష్ వద్దనే చెప్పాడు. మహేష్ చూపంతా అనిరుధ్ మీద ఉంది కానీ త్రివిక్రమ్ సర్ది చెప్పి మహేష్ ను ఒప్పించి థమన్‌కు అవకాశం ఇస్తే థమన్ ఇప్పటివరకు ఈ సినిమాకు ఇచ్చిన ఔట్పుట్ చాలా బోరుగా ఉందని మహేష్ ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయిష్టంగానే థమన్ కూడా గుంటూరు కారం సినిమాకు వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇటు మహేష్ అభిమానుల నుంచి థమన్‌కు భారీ ట్రోలింగ్ తప్పడం లేదు. ఈ టైంలో గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ వస్తోంది. దీని మీద చాలా ఆశలు ఉన్నాయి. మిగిలిన దర్శకులతో థమన్ వర్క్ ఎలా ఉన్నా ?త్రివిక్రమ్‌తో వేరే లెవల్లో ఉంటుందన్న ఆశలు ఉన్నాయి. మరి ఈ ప్రోమోతో థమన్ మహేష్‌ను మెప్పిస్తే ఇకపై భవిష్యత్తులో మహేష్ సినిమాలకు థమన్ పనిచేస్తాడు అనుకోవచ్చు. లేదా మరోసారి థమన్ పూర్ అవుట్ పుట్తో చేతులు దులిపేసుకుంటే ఇక మహేష్ థమన్ కలిసి పని చేస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఇప్పుడు మహేష్ తో బంధం కంటిన్యు అవుతుందా ? లేదా అన్నది థమన్ చేతుల్లోనే ఉంది.