Newsప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో-హీరోయిన్లు వీళ్ళే.. ఎవరు హిట్ - ఎవరు...

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో-హీరోయిన్లు వీళ్ళే.. ఎవరు హిట్ – ఎవరు ఫట్..మీరే చెప్పండి..!

ప్రేమ ..ఎప్పుడు..? ఎవరికీ..? ఎలా పుడుతుందో..? ఎవ్వరు చెప్పలేరు . అది ఎప్పుడైనా పుట్టచ్చు . ఎవరికైనా పుట్టచ్చు . ఎలా అయినా పుట్టచ్చు . అని ప్రేమికులు చెప్తూ ఉంటారు . మరి కొంతమంది ప్రేమ గుడ్డిది అంటూ కూడా అంటుంటారు . ప్రేమ గుడ్డిదో ..? మెల్లదో..? తెలియదు కానీ ప్రేమ చాలా చాలా విలువైనది అని లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు చెబుతూ ఉంటారు . ఈ డైలాగ్స్ కొంచెం సేపు పక్కన పెడితే .. సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమా షూట్ చేస్తున్నప్పుడు హీరో హీరోయిన్లు ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అయి ప్రేమలో పడడం జరుగుతూ ఉంటుంది .

అలా కొంతమంది పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వగా ..మరి కొంతమంది ప్రేమ పేరుతోనే ఆగిపోయి బ్రేకప్ చెప్పుకున్నారు. మరి కొంతమంది ప్రేమించుకుని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు . వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!!

కృష్ణ-విజయనిర్మల: సూపర్ స్టార్ కృష్ణ.. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఆల్రెడీ ఇందిరా దేవికి భర్తగా ఉన్నా కూడా హీరోయిన్ విజయనిర్మలతో ప్రేమలో పడ్డాడు. అంతేకాదు విజయనిర్మలను రెండో వివాహం కూడా చేసుకున్నాడు. చనిపోయే వరకు వీళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.

నాగార్జున-అమల: అప్పటికే లక్ష్మీతో పెళ్లయిన నాగార్జున నాగచైతన్యకు తండ్రి కూడా అయ్యాడు . అయినా వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయి అమలను పెళ్లి చేసుకున్నాడు .

రాజశేఖర్-జీవిత: వీళ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అంకుశం-ఆహుతి వంటి హిట్ చిత్రాలలో కలిసి నటించిన జీవిత-రాజశేఖర్ ప్రేమలో పడ్డారు . 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు . ఇద్దరు హీరోయిన్స్ గా ట్రై చేస్తున్నారు .

పవన్-రేణూ దేశాయ్: వీళ్ళ పెళ్లి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రెండో వివాహంగా రేణు దేశాయ్ ని చేసుకున్నారు . బద్రి మూవీ టైం లో ఇద్దరు మధ్య ప్రేమ పుట్టింది. ఆ తర్వాత డేటింగ్ చేశారు . అకీరా జన్మించాక 2009లో వివాహం చేసుకున్నారు . 2012లో విడాకులు తీసుకున్నారు . ఆ తర్వాత రష్యన్ నటి అన్న లెజినావో ని మూడో వివాహం చేసుకున్నాడు .

మహేష్-నమ్రత: వంశీ సినిమా షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డ వీళ్ళు 2005లో పెళ్లి చేసుకున్నారు . వీరికి గౌతమ్ సితారాలు పుట్టారు.

సమంత-నాగచైతన్య: ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఈ జంట . 2018లో గోవాలో గ్రాండ్ గా హిందూ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు .నాలుగేళ్ల కాపురం తర్వాత 2021లో మనస్పర్ధలు కారణంగా విడిపోయారు.

లావణ్య-వరుణ్: రీసెంట్ గా ఒకటైన ఈ జంట 2017లో మిస్టర్ మూవీలో కలిసినటించారు . ఆ టైంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో నటించారు . ప్రేమ మరింత బలంగా మారింది . 2023 నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని భార్యాభర్తలు గా మారారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news