Newsచిరంజీవి చేతి పై ఉండే పచ్చబొట్టు ఎవరిదో తెలుసా..? మోస్ట్ మోస్ట్...

చిరంజీవి చేతి పై ఉండే పచ్చబొట్టు ఎవరిదో తెలుసా..? మోస్ట్ మోస్ట్ స్పెషల్.. సురేఖ మాత్రం కాదండోయ్..!!

ఈ మధ్యకాలంలో యువత పచ్చబొట్టును అదేనండి టాటూను ఎక్కువగా వేయించుకుంటున్నారు. కొందరు స్టైల్ కి మరికొందరు ప్రేమకి .. మరికొందరు దేనికో దానికి ఇలా కొంతమంది టాటూస్ ఎక్కువగా వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అయితే ఒకప్పటిలో పచ్చబొట్టును తమకు ఇష్టమైన వాళ్ళ కోసం వేయించుకునే వాళ్ళు . ఇప్పట్లా నొప్పి తెలియకుండా ఉండటానికి మందులు ఏవీ లేవు .. అప్పుడు ఆ నొప్పి భరించాల్సిందే .

తమకు ఇష్టమైన వారి కోసం ఎంత నొప్పి అయినా భరించి ప్రేమగా వాళ్ల పేరులను వారి బొమ్మలను పచ్చబొట్టు వేయించుకునేవారు . ఆ లిస్టులోకి మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తాడు. చిరంజీవి కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడట . అయితే అది సురేఖ పేరు అనుకుంటే పొరపాటే .. తన అమ్మ అంజన దేవి గారి పేరు వచ్చేలా అంజమ్మా అని చిరంజీవి పచ్చబొట్టు వేయించుకున్నారట.

ఈ పచ్చ బొట్టు చిరంజీవి చేతి బ్యాక్ సైడ్ పై ఉంటుందట .ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . అంతేకాదు ఫోటోగ్రఫీలో అది క్యాప్చర్ అవ్వదు . తన తల్లి అంటే చిరంజీవికి చాలా చాలా ఇష్టమని అందుకే ఆమె పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అని అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు అని .. తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే ప్రతి కొడుకు ఉన్నత స్థాయికి చేరుకుంటాడు అని జనాలు ఆయన ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news