Newsఅమల, నాగార్జునల కాపురం నిలబెట్టిన సీనియర్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

అమల, నాగార్జునల కాపురం నిలబెట్టిన సీనియర్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్‌లో సెకండ్ మ్యారేజెస్ గురించి, డివోర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా అక్కినేని ఫ్యామిలీ ఆ తర్వాత మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటారు. అక్కినేని ఫ్యామిలీలో నాగ చైతన్య, సమంత ప్రేమించి రెండు మత సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి..ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయిన సంగతీ తెలిసిందే.

ప్రస్తుతం నాగ చైతన్య సింగిల్ గానే ఉంటున్నాడు. శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో ఇద్దరి వైపు నుంచి ఎలాంటి క్లూ లేదు. ఇక అఖిల్ అక్కినేని కి నిశ్చితార్థం జరిగి ఆ తర్వాత పెళ్లి ఆగిపోయిన సంగతీ తెలిసిందే. మళ్ళీ ఇంతవరకూ అఖిల్ పెళ్లి ప్రస్థావన రాలేదు. అయితే, నాగార్జున ఇద్దరు కొడుకు ఈ విషయంలో తండ్రిని అనుసరిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

నాగార్జున ముందు వెంకటేశ్ సోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరికీ కుదరక విడాకులు తీసుకున్నారు. కొంతకాలానికి నాగార్జున అమలని ప్రేమించాడు. ఈ విషయం తండ్రి నాగేశ్వరరావుతో చెప్తే ససేమిరా అన్నారు. అయినా నాగార్జున వినకుండా అమలని పెళ్లి చేసుకున్నాడు. ఇది నచ్చక నాగేశ్వరరావు నాగార్జున ని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నారట. కొన్నాళ్ళు నాగార్జునకి తండ్ర్తో మాటలు కూడా లేవట.

ఆ సమయంలో సీనియర్ నటుడు మురళీమోహన్ కలుగజేసుకొని నాగేశ్వరరావుతో మాట్లాడి అన్నపూర్ణ స్టూడియో బాధ్యత‌లున్నాయి. అవన్నీ చూసుకోవాల్సింది నాగార్జుననే కదా. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఇంతకుముందు పెళ్లి మీ ఇష్టప్రకారం జరిగింది. ఇక‌నైనా నిలవలేదు కదా. ఈ సారి తన ఇష్టానికి వదిలేయండి. కొడుకును దగ్గరికి తీసుకోండి అంటూ రాజీ కుదిర్చారట. అలా ఏన్నార్ కి నాగార్జునకి వచ్చిన గ్యాప్ ని మురళీమోహన్ ఫిల్ చేశారట. ఈ విషయం ఇండస్ట్రీలోని వారికి తప్ప అందరికీ తెలియదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news