మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయింది. బాబీ దర్శకత్వంలో తరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూ.150 కోట్ల షేర్ రాబట్టింది. చిరంజీవికి జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటించగా.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ పోలీస్ ఇన్స్పెక్టర్ గా నటించారు.
చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాక ఆయనకు సరైన సూపర్ డూపర్ హిట్ వాల్తేరు వీరయ్య అని చెప్పాలి. ఖైదీ నెంబర్ 150 సినిమా హిట్ అయినా అది రీమిక్ సినిమా. వాల్తేరు వీరయ్య తో హిట్ కొట్టిన చిరంజీవి ఎనిమిది నెలల గ్యాప్ లోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ కావడంతో పాటు చిరంజీవి పరువు మొత్తం తీసేసింది.
వెండితెరపై చిరంజీవికి ఇది దిమ్మతిరిగే షాక్ అని చెప్పాలి. విచిత్రం ఏంటంటే థియేటర్లలో సూపర్ హిట్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాను దసరా సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెరపై ప్రసారం చేశారు. అయితే ఈ సినిమాకు బుల్లితెరపై చాలా పూర్ టిఆర్పి రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకు కేవలం 5.14 టిఆర్పి రేటింగ్ మాత్రమే వచ్చింది. ఈ రేంజ్ సినిమాకి ఇది చాలా తక్కువ.
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్, రవితేజ లాంటి వాళ్ళు ఉండి థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాకు ఐదు టీఆర్పి రేటింగ్ అంటే ఈ సినిమా పట్ల బుల్లితెర ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తితో లేరని తెలుస్తోంది. ఇక చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో యూవి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.