ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో గట్టి పోటీ ఉంది. ముందుగా మహేష్‌బాబు గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ అన్నారు. ఆ తర్వాత రవితేజ ఈగల్ జనవరి 13 డేట్ వేశారు. ఆ వెంటనే హనుమాన్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, వెంకటేష్ సైంధవ్ జనవరి 13 డేట్ వేసుకుని ఉన్నారు. ఇక నాగార్జున నా సామిరంగ సినిమాను కూడా సంక్రాంతి రేసులోనే నిలుపుతున్నట్టు ముందుగానే ప్రకటించేశారు.
దీంతో ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే థియేటర్ల ఇబ్బంది తప్పదు… అసలు చివరి వరకు ఈ రేసులో ఎవరు ? ఉంటారు ? ఎవరు తప్పుకుంటారన్న చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ రేసు నుంచి ముందుగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇంత గట్టి పోటీ మధ్యలో సంక్రాంతికి వస్తే అనుకున్న రేంజ్‌లో కలెక్షన్లు రావని.. దిల్ రాజు తన సినిమాను సంక్రాంతి రేస్ నుంచి డ్రాఫ్ చేసేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు అదిరిపోయే రెస్సాన్స్ వచ్చింది. ముందుగా సంక్రాంతికే తన సినిమాను రేసులో దించుతున్నట్టు రాజు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. అసలే విజయ్‌కు సరైన హిట్ లేదు. లైగర్ పెద్ద డిజాస్టర్. ఖుషి విజయ్ రేంజ్‌కు తగ్గ హిట్ కాదు.
ఇప్పుడు సంక్రాంతికి గట్టి పోటీ మధ్యలో ఫ్యామిలీస్టార్ రిలీజ్ చేస్తే.. అటు మహేష్, నాగార్జున, రవితేజ, వెంకటేష్ సినిమాలు పోటీలో ఉన్నాయి. కలెక్షన్లు పంచుకోవాలి.. థియేటర్ల కౌంట్ సరిగా ఉండదు. పైగా గుంటూరు కారం నైజాం పంపిణీ దిల్ రాజుదే. ఇవన్నీ ఆలోచించే విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్‌ను సంక్రాంతి రేస్ నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. సో సంక్రాంతి రేస్ నుంచి ఓ స్టార్ హీరో అవుట్ అయ్యాడు.. ఇక మిగిలిన సినిమాల్లో కూడా కొన్ని తప్పుకుంటాయంటున్నారు.