పుష్ప ..పుష్ప రాజ్ ..నీ అవ్వ తగ్గేదేలే . ఈ డైలాగ్ విన్న ప్రతిసారి మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి..ఏదో ఫీలింగ్స్ కలిగిపోతు ఉంటాయి. అలాంటి ఓ గూస్ బంప్స్ డైలాగ్ ను మన కోసం రాసుకొచ్చాడు సుకుమార్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ కెరియర్ లోని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బన్నీ సుకుమార్ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రీసెంట్ గానే బన్నీ సైతం ఈ సినిమాలో నటించినందుకు ఉత్తమ జాతీయ నటుడి అవార్డు అందుకున్నాడు . కాగా ప్రజెంట్ పుష్ప 2 సినిమా సెట్స్ పై ఉంది . ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే పుష్ప వన్ సినిమాలో దాక్షాయిని పాత్రలో కనిపించిన అనసూయ రోల్లో మొదటగా కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ను అనుకున్నారట సుకుమార్.
అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పాత్ర చేయడానికి అంగీకరించలేదట . ఇది విలన్ రోల్ కాదు అలా అని లీడ్ రోల్ కాదు అందుకే అప్పుడప్పుడే ఎదుగుతున్న తన కెరియర్ రిస్క్ లో పెట్టుకోలేక వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఈ పాత్ర కోసం చాలామంది బ్యూటీస్ ని అప్రోచ్ అయిన ఫైనల్లి అనసూయ సెలెక్ట్ అయింది..!