బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ? అందుకుంటుందో ఎవరు చెప్పలేరు. కొన్నిసార్లు కంటెంట్ పరంగా క్లిక్ అయినా.. వసూళ్లు బోల్తా కొడుతూ ఉంటాయి. కొన్నిసార్లు కంటెంట్ బాగున్నా సినిమా బ్రేక్ ఈవెన్ కాదు. ఏది ఏమైనా టాలీవుడ్‌లో సినిమాలు చూసే ప్రేక్షకుడి అభిరుచిలోను మార్పు వచ్చింది. ఇటు ట్రేడ్ వర్గాల్లో బిజినెస్ లోను కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ప్రేక్షకుడని థియేటర్లకు రప్పించడం చాలా కష్టం అవుతుంది.
స్టార్ హీరోల సినిమాలకే అనుకున్న రేంజ్ లో బిజినెస్ జరగటం లేదు. భారీ రేంజ్ లో డబ్బులు పెట్టి కొనేందుకు బయ్యర్లు కూడా ఆసక్తి చేపట్టడం లేదు. ఒకవేళ ముందుగా ఇంత రేటు ఇస్తామని చెబుతున్న తీరా సినిమా రిలీజ్ టైం దగ్గరకు వచ్చేసరికి అందులో కోతలు పెట్టి కడుతున్నారు. ఇటు నిర్మాతలు కూడా ఏం చేయలేని పరిస్థితి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ప్రశాంత నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన సలార్ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో చూశాం.
ఈ సినిమాకు ఏపీ, తెలంగాణలో టాప్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ముందు అంచనాలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్‌ను కూడా సలార్ దాటలేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమాకు ఏపీ తెలంగాణలోని రూ.210 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సలార్ సినిమాకు ఏపీ, తెలంగాణలో కేవలం రూ.170 కోట్లు మాత్రమే బిజినెస్ జరిగిందని అంటున్నారు.
ఆ మొత్తం కూడా పూర్తిగా వస్తుందా అంటే సందేహంగానే కనిపిస్తోంది. అదే జరిగితే సలార్‌కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. రెండు మూడు సార్లు వాయిదా పడటంతో పాటు టీజర్ తో పాటు స్టిల్స్ రిలీజ్ అయిన సలార్‌పై ఎందుకో ? హైప్ అయితే పెరగటం లేదు. ఇటు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయంలోను ఇదే జరుగుతుందని ట్రేడ్ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. సంక్రాంతి బరిలోకి దిగే సినిమాల లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇంత టఫ్ కాంబినేషన్ ఉండడంతోపాటు.. థియేటర్లు తక్కువగా దొరికే ఛాన్సులు ఉండడంతో బయ్యర్లు మహేష్ సినిమాపై భారీ మొత్తం పెట్టేందుకు రిస్క్ చేయడానికి వెనుక ముందు ఆడుతున్నారు.
గుంటూరు కారంకు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష వరకు రూ.150 కోట్ల బిజినెస్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఏపీ, తెలంగాణ వరకు చూస్తే ఈ సినిమాకు ముందు అనుకున్న బిజినెస్ కంటే తక్కువ జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇంత పెద్ద కాంబినేషన్ అయినా.. అనుకున్న స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగటం లేదు. దర్శికులు, హీరోలు, టెక్నీషియన్ల భారీ రెమ్యూనరేషన్లు నేపథ్యంలో సినిమా మేకింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద సంక్షోభంలోనే పడుతుందని చెప్పాలి.