సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రేక్షకుల అభిరుచిని మించిన ఆదరణ మరొకటి లేదు. అందుకే.. ప్రేక్షకులు కోరుకున్నట్టే.. నటీనటులు ఉండేవారు. ఎన్టీఆర్ స్టెప్పులు, ఏఎన్నార్ స్టెప్పులు కొన్ని వర్గాల వారే ఇష్టపడేవారు. కానీ, నటనను మాత్రం అందరూ ఇష్టపడేవారు. ఇక, హీరోయిన్ల విషయానికి వస్తే.. సావిత్రి చెక్కిన శిల్పంగా ఉంటే.. అంజలీదేవి పొట్టిగా ఉన్నా.. ఆమెను కూడా.. ఇష్టపడ్డారు. ఇక, అప్పట్లోనూ ప్రేక్షకుల అభిరుచి.. అవకాశాల కోసం.. నటీనటులు ఆపరేషన్లు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇలాంటివారిలో శ్రీదేవి మనకు తెలిసిందే. ఆమె బాల నటిగా తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టినా.. తర్వాత తర్వాత.. పుంజుకుని బాలీవుడ్‌లోకి వెళ్లింది. అయితే.. అక్కడ ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీనికి కారణం.. బండ ముక్కేనని నిర్మాతలు తేల్చేశారు. దీంతో ఆమె అమెరికా వెళ్లి.. ముక్కును సూటిగా నిటారుగా సంపెంగ పువ్వుమాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. ఇలా.. ఆమె ఏకంగా 16 సార్లు ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్నారు.
ఇక, ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీల్లోనూ ముక్క సమస్య ఎదుర్కొన్న అగ్రతార జీ. వరలక్ష్మి. ఆమె చూసేందుకు బాగానే ఉంటారు. అభినయం వర్ణనాతీతం. అయితే.. ముక్కు మాత్రం బండగా ఉండడంతో అవకాశాలు తగ్గాయి. ఇదే విషయంపై ఆమెకు కొందరు దర్శకులు.. ఆపరేషన్ చేయించుకోవాలని.. అప్పుడు మరిన్ని అవకాశాలు వస్తాయని తేల్చి చెప్పారు.
కానీ.. జీ వరలక్ష్మి.. స్వతః సిద్ధంగా భగవంతుడు ఇచ్చిన అందమే అందం.. కోరి తగిలించుకోవాల్సిన అవసరం లేదు.. అని ఆ వాదనను తిరస్కరించారు. ఫలితంగా ఆమెకు హీరోయిన్ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయినా..వరలక్ష్మి బాధ పడకుండా.. క్యారెక్టర్ నటనకే పరిమితమయ్యారు.