ఆర్ఎక్స్ 100, మహాసముద్రం సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా మంగళవారం. ఈ సినిమా గురించి అప్పుడే టాలీవుడ్ లో తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తన లక్కీ ఛార్మ్ పాయల్ రాజపుత్తో మరోసారి ప్రేక్షకులకు మంచి అనుభూతి అందించే అదిరిపోయే పాత్ర చేయించారట దర్శకుడు అజయ్ భూపతి.
మంగళవారం సినిమాలో ఆమె పాత్ర హైలెట్ కాబోతుందని టాక్. ఇప్పటికి ట్రైలర్లో పాయల్ క్యారెక్టర్ ఎలా ? ఉండబోతుందో చూపించి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు అజయ్ భూపతి. ఈ సినిమా ట్రైలర్ గత నెలలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్వయంగా లాంఛ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాతలు స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ గురించి చిరు ముందుగా ప్రస్తావించారు.
వారిద్దరూ తనకు ఎంతో సన్నిహితులని తెలిపారు. ముఖ్యంగా స్వాతి రెడ్డి ఎంతో డైనమిక్ అని.. ఆమె తన చిన్న కుమార్తె శ్రీజకు బెస్ట్ ఫ్రెండ్ అని చిరు వెల్లడించారు. దీంతో శ్రీజకు బెస్ట్ ఫ్రెండ్ స్వాతి రెడ్డి అనే వార్త బాగా ప్రజల్లోకి వెళ్ళింది. అసలు ఈ స్వాతి రెడ్డి ఎవరు.. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాలు ఇప్పుడు పూర్తిగా బయటికి వచ్చాయి. నిజానికి స్వాతి రెడ్డి గునుపాటి నిర్మాత అని పేర్కొన్నారు. కానీ స్వాతి నిమ్మగడ్డ అని చెబితే అందరికీ అప్పుడే అర్థమయ్యేది.
ఆమె ఎవరో కాదు ? ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె. అయితే ఆమె అందరికీ స్వాతి నిమ్మగడ్డ గానే తెలుసు. 2016లో పారిశ్రామికవేత్త గునుపాటి శివకుమార్ తనయుడు ప్రణవ్ రెడ్డిని.. స్వాతి పెళ్లాడారు. అప్పటినుంచి ఆమె స్వాతిరెడ్డి గునుపాటి అయ్యారు. ఇప్పుడు మంగళవారం నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి అంటే ఎవరో అనుకున్నారు. అయితే ఆమె మ్యాట్రిక్స్ ఫార్మా సంస్థ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ కూతురని ఇప్పుడు బయటకు వచ్చింది.