ఈ మధ్యకాలంలో సినీ స్టార్ హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా అది వైరల్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా కొంతమంది కాంట్రవర్షియల్ బ్యూటీ లు టంగ్ స్లిప్ అయితే చాలు పెద్ద రాద్ధాంతం చేసేస్తున్నారు జనాలు . ఇలాంటి క్రమంలోనే మరోసారి మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది హాట్ బ్యూటీ అదితి రావు హైదరి .
మలయాళం లో ప్రజాపతి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలో చేస్తూ బిజీ అయిపోయింది . ఆ తర్వాత సమ్మోహనం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె పలు సినిమాలు కూడా చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజెంట్ బాలీవుడ్ లో పలు సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తుంది. సిద్ధార్ధ్ తో చటాపట్టాలు వేసుకొని తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న అదితి రావ్ హైదరి .. తాజాగా బాలీవుడ్ లోని ఓ ప్రముఖ సినీ మీడియా సినీ పరిశ్రమలోని పలువురు మహిళా ప్రముఖులను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆమెను యాంకర్ ” మీరు ఏమి వినకూడదు అనుకుంటున్నారు..?” అంటూ ప్రశ్నించారు . దీనికి అదితీ రావు స్పందిస్తూ” ఎవరైనా సరే వచ్చి ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అని చెప్పడం నాకు ఇష్టం లేదు . అలాంటిది వినకూడదు అనుకుంటున్నాను. ఎవరూ కూడా హీరోల దగ్గరకు వెళ్లి ఇది హీరోస్ సెంట్రిక్ ఫిలిం అని చెప్పరు కదా ..? మన కథ చెప్తాము ..? అంతే అందరూ కథలు చెప్పడానికి ఇక్కడ ఉన్నారు. కానీ మహిళ నటులు దగ్గరకు వస్తే మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమా అని చెప్తారు ఆ మాట నేను వినకూడదు అనుకుంటున్నాను “అంటూ చాలా బోల్డ్ గా స్పందించింది అదితి. ఈమె మాటలకు పలువురు హీరోయిన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు..!!