ప్రజెంట్ తెలంగాణలో ఎక్కడ చూసినా సరే టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. గత ఐదు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చేసాయి . ఇన్నాళ్లు మైకులలో బూతులు తిట్టుకున్న పార్టీ నేతలు ఇప్పుడు పోలింగ్ బూత్ లలో రచ్చ రంబోలా చేస్తున్నారు . అయితే ఎలక్షన్ సిబ్బంది మాత్రం ప్రశాంతత వాతావరణంలోనే పోలింగ్ ని కండక్ట్ చేస్తుంది .
కాగా తెలంగాణ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళుతుంది పోలింగ్ అంటూ పలువురు ప్రతినిధులు చెప్పుకొస్తున్నారు . అయితే మొదట్లో చాలా తక్కువగా నమోదైన ఓటింగ్ శాతం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. చాలామంది వర్షం కారణంగానే ఇంట్లో ఉండిపోతున్నారు . మరి కొంతమంది సెలవులు ఇచ్చిన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారే తప్పిస్తే ఓట్లు వేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో మైక్ లలో అనౌన్స్ చేస్తూ ఓటు వేయాలి అంటూ హెచ్చరిస్తున్నారు ఆఫీసర్లు
అయితే ఈ విషయం పక్కన పెడితే ఓటు వేయని వాళ్ళని వేయమంటూ ఫోర్స్ చేస్తున్నారు సరే.. మరి బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటి..? అంటూ ప్రశ్నిస్తున్నారు బిగ్ బాస్ లవర్స్ . అందరిలాగే వాళ్ళకి ఓట్లు ఉంటాయిగా . మరి ఓటు హక్కును వాళ్ళు ఎలా వినియోగించుకుంటారు ..? అంటూ ప్రశ్నిస్తున్నారు . జనరల్గా ఓటు హక్కును వినియోగించుకోవాలి అనుకునేవారు ఎవరైనా ప్రభుత్వం లేదా ప్రత్యేక విధుల్లో భాగంగా బయటకు వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ “బ్యాలెట్ ఓటింగ్” పద్ధతిని అనుసరిస్తుంది.
అయితే ఇదే క్రమంలో తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్స్ లో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓటు వేసేలా ప్లాన్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతుంది..!!