కోలీవుడ్ సీనియర్ హీరో గంగా ( 53 ) శుక్రవారం సాయంత్రం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు. గంగ అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఏమో గాని ప్రస్తుత కోలీవుడ్ కుర్ర హీరో, సీనియర్ నటుడు, దర్శక నిర్మాత టి రాజేంద్ర దర్శకత్వం వహించిన ఉయిరుళ్లు వరై ఉష సినిమాతో హీరోగా పరిచయం అయ్యి తొలి సినిమాతోనే తెలుగు, తమిళ భాషల్లో సూపర్ పాపులర్ హీరో అయిపోయాడు. తెలుగులో ఈ సినిమా ప్రేమ సాగరం పేరుతో రిలీజ్ అయింది.
తమిళంలో ఏడాదికి పైగా ఆడిన ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు అప్పటి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా 400 రోజులు ఆడింది. ఈ సినిమాలో నళిని హీరోయిన్గా నటించింది. అప్పట్లో ఈ సినిమాలో పాటలు కాలేజ్ కుర్రకాలను ఒక ఊపు ఊపేశాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో నటుడు గంగాకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత వరుసగా క్రైమ్ తొడెం అలై గల్ – మురుగేషణ్ తునై – మామండ్రం – సావిత్రి వంటి సినిమాలలో నటించారు.
ఆ తర్వాత సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవటంతో గంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. అనంతరం కోలీవుడ్లో కొన్ని టీవీ సీరియల్స్ నటించి బాగా పాపులర్ అయ్యారు. కొన్ని టీవీ సీరియల్స్ కు దర్శకత్వం కూడా వహించారు. చెన్నైలో స్థానిక మైలాపూర్ లో నివసిస్తున్న గంగా పెళ్లి చేసుకుంటా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు.
శుక్రవారం సాయంత్రం గంగాకు హఠాత్తుగా గుండెపోటు రావటంతో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని సొంతూరు చిదంబరం సమీపంలోని భరత్పూర్ చావడి గ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. గంగా మృతిపట్ల పలువురు కోలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.