Newsబిగ్ బాస్ హౌస్ లో అలా చేసి కెరీర్ నాశనం చేసుకున్న...

బిగ్ బాస్ హౌస్ లో అలా చేసి కెరీర్ నాశనం చేసుకున్న కంటెస్టెంట్స్ వీళ్ళే.. అందరికమంటే హైలెట్ ఆ జంటే..!!

బిగ్ బాస్.. ఈ షో వల్ల బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకు డబల్ రేంజ్ లో షోలోకి వచ్చి తమ పేరును చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లలో ఫస్ట్ ప్లేస్ లో మనం చెప్పుకోవాల్సింది ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్. అంతకుముందు యూట్యూబ్లో ఇతగాడు నెంబర్ వన్ హౌస్ లోకి వచ్చి గేమ్ ఆడి బయటకు వెళ్లే టయానికి ఇది గాడి క్రేజ్ రేంజ్ జీరో కి పడిపోయింది . తన సొంత గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా కూడా బ్రేకప్ చెప్పేసి బయటకు వచ్చేసింది . దానికి కారణం బిగ్ బాస్ లో ఈయన నడిపిన ప్రేమాయణాలు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. కేవలం షణ్ముక్ నే కాదు బిగ్ బాస్ హౌస్ లో చాలామంది యంగ్ స్టార్స్ ప్రేమాయణం నడిపారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా పెళ్లి చేసుకోలేదు. ఆశ్చర్యమేంటంటే అసలు వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు ..అలాంటి జంటలు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం ..!!

బిగ్ బాస్ సీజన్ 3 : సూపర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నటి పునర్నవి భూపాలం మధ్య ఎలాంటి ప్రేమ నడిచిందో అందరికీ తెలిసిందే . కానీ ఇది ప్రేమ కాదు అని వాళ్ళు అంటున్నారు. కాదు కాదు మీది ప్రేమే అని జనాలు అంటున్నారు. వీళ్లు ఆ టైంలో చేసిన రచ్చ అంతా కాదు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరు టచ్ లో కూడా లేరు .

బిగ్బాస్ సీజన్ 4 : మోనాల్ అఖిల్ అప్పట్లో వీళ్ల ప్రేమ హైలైట్ గా మారింది . అంతెందుకు హౌస్ నుండి రాగానే మూడు ముళ్ళు వేసుకుంటారు అనుకున్నాం. కానీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు.

బిగ్ బాస్ సీజన్ 4 : హారిక అభిజిత్.. మొదట ఫ్రెండ్స్ అంటూ ఆ తర్వాత తెలియకుండానే క్లోజ్ అయిపోయిన ఈ జంట అప్పట్లో హైలైట్ గా మారింది. అప్పటికే హారిక యూట్యూబ్ ఛానల్ లో ఫేమస్ కావడంతో ఆమె పేరు మరింత హైలెట్ అయ్యింది. టైటిల్ కొట్టిన తర్వాత హారిక నా చెల్లి అంటూ బిగ్ ఝలక్ ఇచ్చాడు .

బిగ్ బాస్ సీజన్ 5: షణ్ముక్ – సిరి ఇది అని లవ్ స్టోరీలోకి హైలైట్ అని చెప్పాలి . వీళ్లది ప్రేమ కాదు కానీ హగ్గులు చేసుకుంటారు.. వీళ్ళది లవ్ కాదు కానీ వెనకల నుంచి వాటేసుకుంటారు. బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంటారు . వీళ్ళ ప్రేమాయణం ఎలా ఉండేది అంటే షణ్ముక్ కి సిరి వేరే వాళ్లతో మాట్లాడితే నచ్చేదే కాదు . ఒక సొంత భార్యను ట్రీట్ చేసిన్నట్లు చేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. సీన్ కట్ చేస్తే హౌస్ నుంచి బయటికి వచ్చాక తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా బ్రేకప్ చెప్పడమే కాకుండా ఆయన కెరియర్ డమాల్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 5: శ్రీరాం హామీద చాలా ట్రూ లవ్ స్టోరీ అనుకున్నారు . అంతేకాదు ఇప్పటివరకు హౌస్ లో ఉన్న ప్రేమాయణం లో ఇదే హైలెట్ అంటూ జనాలు కూడా మంచిగా వీళ్ళ గురించి మాట్లాడుకున్నారు . ఎటువంటి వలిగారిటీ లేకుండా చాలా రియల్ గా లవ్ చేసుకున్న ఈ జంట ఎందుకో బిగ్ బాస్ సీజన్ తర్వాత దగ్గర కాలేకపోయారు.

బిగ్ బాస్ సీజన్ 6 : సూర్య-ఇనయా సుల్తానా వీళ్ళ ప్రేమాయణం ఎలా నడిచిందో మనకు తెలిసిందే . సూర్య నా క్రష్ అంటూ ఓపెన్ గానే చెప్పేసి వీళ్ళ మధ్య ఓ పెద్ద గ్రంథమే నడిచిందని చెప్పాలి. ఇప్పుడు దూరంగా ఉన్నారు.

బిగ్ బాస్ సీజన్ 7: లేటుగా స్టార్ట్ చేసిన లేటెస్ట్ గా ప్రేమాయణం నడిపారు గౌతమ్ శుభశ్రీ. గౌతమ్ శుభశ్రీకి లైన్ వేశాడు . ఆమె కూడా లైట్ గా సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేసింది. వీళ్లబంధం బలపడేలో బిగ్ బాస్ నాలుగవ వారం శుభశ్రీని ఎలిమినేట్ చేసి బయటికి పంపించేసాడు . దీంతో వీళ్ళ ప్రేమకథ మొదలవ్వకుండానే ఫుల్ స్టాప్ పెట్టేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news