సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు తమ కలలను నెరవేర్చుకోకుండానే ఫేడ్ అవుట్ అయిపోతున్నారు . అదే లిస్టు లోకి వస్తాడు వెంకటేష్ . అసలు వెంకటేష్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫ్యామిలీ హీరో అని.. ఫ్యామిలీ హీరో అంటే వెంకటేష్ నే గుర్తొస్తాడు. అంతేకాదు హౌస్ వైఫ్ ల ను థియేటర్స్ కు రప్పించిన ఘనత వెంకటేష్ కే దక్కుతుంది .
అలాంటి హోమ్లీ రోల్స్ లో కనిపించిన వెంకటేష్ యాక్షన్ సీన్స్ లో నటిస్తే చూడాలి అన్నది వెంకటేష్ భార్య కోరికట . మొదటినుంచి వెంకటేష్ ని ఫ్యామిలీ జోనర్ టైప్ సినిమాల్లో చూసి చూసి బోర్ కొట్టిందని.. గన్ పట్టుకొని కాలుస్తూ యాక్షన్ మోడ్లో బిల్డింగ్స్ దూకుతూ ఉండేలా ఓ సినిమా చేయమని ఎప్పటినుంచో కోరుతూ వస్తుందట ఆయన భార్య.
అయితే ఘర్షణ సినిమా ఆ కోరిక తీరుస్తుంది అని భావించిన వెంకటేష్ భార్య ఆ విషయంలో ఫ్లాప్ అయింది . ఆ సినిమా అంతగా వెంకటేష్ అభిమానులకు సైతం నచ్చలేదు . అయితే చాలా మంది డైరెక్టర్స్ వెంకటేష్ కటౌట్ కి ఎక్కువగా హోంలీ రోల్స్ నే సూట్ అవుతాయని .. అలాంటి పాత్రలే తీసుకొచ్చారు. దీంతో వెంకటేష్ భార్య కోరిక ఇంకా అలాగే ఉంది . అంతేకాదు ఇకపై అలాంటి సినిమాలు వెంకటేష్ చేతికి వస్తాయి అనుకోని వెయిట్ చేయడం కూడా మిస్టేక్ అవుతుంది అంటున్నారు అభిమానులు..!!