అవునండి ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్న అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. చాలామంది అనుకుంటున్నారు అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్నాడు.
ఇక పాన్ ఇండియా లెవెల్ టైప్ లో ఉండే సినిమాలనే చూస్ చేసుకుంటాడు అని ..కానీ అది అంతా అబద్ధం అంటూ ఒక్క మాటతో తేల్చేశాడు అల్లు అర్జున్. పాన్ ఇండియా హీరో అనేది అసలు స్టేటస్ కాదని .. అన్ని వర్గాల ప్రజలను అలరించడమే నా లక్ష్యం అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు . అంతేకాదు పుష్ప తర్వాత ఇక నేను చిన్న సినిమాల్లో నటించను అంటూ ప్రచారం జరుగుతుంది అని ..
అదంతా తప్పు అని కంటెంట్ బాగుంటే గెస్ట్ రోల్ లో నటించడానికి కూడా నేను సిద్ధమే అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నాడు. ఒక్కొక్కరు పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక చిన్న సినిమాలు చేయడం లేదని ..బన్నీ మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోకుండా మంచి పనే చేశాడు అని ..దటీజ్ బన్నీ అంటూ పొగిడేస్తున్నారు..!!