Newsరాహుల్‌తో ర‌తికా బ్రేక‌ప్‌కు అదే కార‌ణం... ఇన్నాళ్ల‌కు ఆ సీక్రెట్ బ‌య‌ట...

రాహుల్‌తో ర‌తికా బ్రేక‌ప్‌కు అదే కార‌ణం… ఇన్నాళ్ల‌కు ఆ సీక్రెట్ బ‌య‌ట పెట్టిన సిస్ట‌ర్‌..!

బిగ్‌బాస్ సీజన్ 7 లో ఎక్కువగా వినిపించిన పేరు రతికా రోజ్‌. రతికా అందంతో పాటు వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయింది. మొదటి రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఈ బ్యూటీ హౌస్ లో తన అందంతో ప్రేక్షకులను అలా కట్టిపడేసింది. తనదైన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. అలాగే హౌస్ లో ఉన్న వారితో గొడవలు పెట్టుకుంటూ బాగా పాపులర్ అయింది. నిజం చెప్పాలంటే రతిక గేమ్ కంటే గొడవలతోనే ఎక్కువ పాపులర్ అయింది.

ఇక రతికపై విమర్శలు ఎక్కువ కావడంతో ప్రేక్షకుల ఓట్లు తక్కువ పడ్డాయి. దీంతో కచ్చితంగా బిగ్ బాస్ ఫైనల్‌కు వెళుతుందని అందరూ భావించిన రతిక రోజ్‌ చాలా త్వరగానే హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమెను తిరిగి హౌస్ లోకి పంపించారు. రతికా హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత తన మాజీ ప్రియుడు గురించి కొన్ని ఆసక్తిక‌ర‌ కామెంట్లు కూడా చేసింది. అతడు పాటలు పాడుతాడని కామెంట్ చేయడంతో ఆమె మాజీ ప్రియుడు సింగర్ అని అర్థమైంది.

ఆ తర్వాత ఆ సింగర్ ఎవరో కాదు ? రాహుల్ సిప్లిగంజ్ అని ప్రచారం జరిగింది. రాహుల్ గతంలో బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రతికా చెప్పిన మాటలు బట్టి వారిద్దరూ ప్రేమలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్, రతికా కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చాలామంది రతికా చెప్పింది రాహుల్ గురించే అని డిసైడ్ అయిపోయారు. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో రాహుల్ దేనిపై స్పందించాడు రాహుల్‌.

రతికా పిఆర్ టీం కావాలనే ఈ ఫోటోలు వైరల్ చేసి తనకు బ్యాడ్ నేమ్ తెస్తుందని అన్నాడు. రతికా బయటకు వచ్చినప్పుడు కూడా దీనిపై స్పందించలేదు. ఇప్పుడు ఆమె తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది. అయితే ఈ ఫోటోలపై రతికా చెల్లెలు స్పందించింది. ఈ ఫోటోలు రాహులే లీక్ చేశాడు అని.. ఆమె ఆరోపిస్తోంది. రతికా ఫోన్ తన దగ్గర లేదు. కనీసం మా దగ్గర కూడా లేదు. అలాంటప్పుడు ఆ ఫోటోలు మేము ఎందుకు లిక్‌ చేస్తాం. వాళ్ల ప్రైవేట్ ఫోటోలు అయితే రతికా దగ్గర లేదా రాహుల్ దగ్గర ఉంటాయి.
కాబట్టి రాహుల్ ఈ ఫోటోలు లీక్ చేసి ఉంటాడు అని కామెంట్ చేసింది.

అలాగే రాహుల్‌ – రతికా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. కానీ పెళ్ళికి ముందే రాహుల్ కొన్ని కండిషన్స్‌ పెట్టాడు. పెళ్లి తర్వాత రతికను సినిమాల్లో నటించవద్దు. ఇండస్ట్రీలోకి వెళ్ళకూడదని చెప్పాడు. అది రతికాకు నచ్చలేదు. ఇద్దరు ఓ అండ‌ర్‌స్టాండింగ్‌కి వచ్చాకే బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఫోటోలు లీక్ అయితే రాహుల్ ఎందుకు అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యాడో తెలియడం లేదని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా రాహుల్ – రతికా ప్రేమాయణం ఇంత సీక్రెట్ గా జరిగిందా అని నెటిజన్లు ఇప్పుడు అవాక్ అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news