నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఈ యేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డితో దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో రెండు సూపర్ డూపర్ హిట్లు కొట్టడంతో పాటు అఖండతో కలుపుకుంటే హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తాజాగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య హీరోయిన్ కాజల్‌ను ఆంటీ అంటూ ఆటపట్టిస్తూ ఉంటాడు.
ఈ సినిమాలో కాజల్ కాత్యాయని అన్న పాత్రలో నటించింది. బాలయ్యను ఆమె ఇష్టపడుతుంటే బాలయ్య మాత్రం కాచీ కాచీ నే చెప్పా అంటూ ఆటపట్టించే సీన్లలో బాగా కామెడీ పండింది. అయితే బాలయ్య కాజల్‌ను ఆంటీ అని కూడా సరదాగా ఆటపట్టిస్తాడు. వాస్తవంగా చూస్తే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ. బాలయ్య వయస్సు 63 అయితే… కాజల్ వయస్సు 38.. ఇద్దరి మధ్య 25 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.
తనకంటే వయస్సులో 25 ఏళ్లు చిన్న అమ్మాయిని బాలయ్య ఆంటీ అనడం ఏంటంటూ సరదాగా కామెంట్లు కూడా పడ్డాయి. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఇది సినిమా కదా.. అదంతా సరదాగా అంటూ మాట్లాడారు. ఇక పెళ్లి తర్వాత బాలయ్య సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పుడు కమల్‌హాసన్ ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది.