రాజమౌళి కంటే సీనియర్ త్రికోటి పేట. కానీ, ఆయన పేరు ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. అసోసియేట్‌గా రాజమౌళీ దగ్గరనే ఉంటున్నారు. చత్రపతి, విక్రమార్కుడు, సింహాద్రి, ఈగ, రాజన్న, యమదొంగ లాంటి సినిమాలకి త్రికోటి రాజమౌళికి సహాయకుడిగా పనిచేశారు. ఎలా అంటే సెట్‌లో రాజమౌళిని “ఏయ్ మౌళి” అని పిలిచేంత చనువు ఉంటుంది.
అయితే, త్రికోటి కి ఎంతకాలం రాజమౌళి దగ్గర ఇలా సహాయకుడిగా చేయాలి..నేను డైరెక్టర్ అవ్వాలని కసి పెరిగింది. దాంతో రాజమౌళి టీం నుంచి బయటకి వచ్చేశారు. సోలోగా దర్శకుడిగా సినిమాలు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ, ఎందుకనో రాజమౌళి అసోసియేట్ అనే స్టాంప్ చూసి కూడా దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వలేదు. అలా కొంతకాలం గడిచిపోయింది.
ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి వెతుక్కుంటూ త్రికోటి దగ్గరకి వెళ్ళారు. కారు ఎక్కించుకొని పంజాగుట్టలో ఉన్న షాపింగ్ మాల్‌లో బట్టలు కొనిచ్చారు. నేరుగా ఆఫీసుకొ తీసుకెళ్ళి రాజమౌళి కొత్తగా చేస్తున్న సినిమాకి ఫస్ట్ కో డైరెక్టర్‌గా రాయించారు. కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చారు. అలా మళ్ళీ రాజమౌళి టీం లో జాయిన్ అయ్యారు త్రికోటి. మాటల రచయిత ఎం రత్నం త్రికోటికి అత్యంత సన్నిహితుడు.
త్రికోటికి ఎప్పుడు డబ్బులు కావాలన్నా చనువుతో వెళ్ళి తెచ్చుకుంటాడు. ఇటీవల వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ కి త్రికోటి ఫస్ట్ కో డైరెక్టర్‌గా చేశాడు. రాజమౌళి సినిమాలో కొన్ని అద్భుతమైన సీన్స్, షాట్స్ ఉన్నాయంటే ఆ క్రెడిట్ త్రికోటిదే. ఇదే విషయం రాజమౌళి కూడా చెప్పారు. ఇక త్రికోటి డైరెక్షన్‌లో దిక్కులు చూడకు రామయ్య, జువ్వ సినిమాలొచ్చాయి. సునీల్‌తో అనుకున్న నెపోలియన్ ఆగిపోయింది. ఇదే కథ నాగ చైతన్యతో కూడా చేయాలనుకున్నాడు. అది కుదరలేదు.