కొంతమంది కుర్ర భామలు మొదటి సినిమా 50 ఏళ్ళున్న హీరోతో చేయడం వల్ల దెబ్బకే కెరీర్ నాశనం అవుతుంది. ఇది ఇండస్ట్రీ వర్గాలలో అలాగే, ప్రేక్షకులు మాట్లాడుకునే మాటలు. మాస్ మహారాజగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన రవితేజ చాలా ఆలస్యంగా హీరో అయ్యాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదిగాడు.
నీకోసం సినిమాతో హీరోగా మారిన రవితేజ అతికొద్దికాలంలోనే మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. మాస్ హీరోగా తనకంటూ బాక్సాఫీస్ వద్ద ఓ మార్కెట్ ని సంపాదించుకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, విక్రమార్కుడు, నేనింతే, డాన్ శీను, సుబాయ్ శీను, భధ్ర..ఇలా రవితేజ అన్నీ మాస్ కథలనే ఎంచుకుంటూ స్టార్ అయ్యాడు.
అయితే, ఆయన పక్కన నటించిన కొందరు స్టార్ హీరోయిన్‌గా వెలిగితే కొందరు మాత్రం గట్టిగా నాలుగు సినిమాలు చేయకుండానే అడ్రస్ లేకుండా పోయారు. అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయితో సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఆసిన్ ఆ తర్వాత తెలుగులో స్టార్ గా వెలిగింది. ఇడియట్ సినిమాతో పరిచయమైన రక్షిత కూడా పెద్ద సినిమాలు చేసింది. మిగతా హీరోయిన్స్ ఫాంలో ఉన్న వాల్ళే.
అయితే, రవితేజకి వరుస ఫ్లాప్స్ వస్తున్న సమయంలో మాళవిక శర్మ తన మొదటి సినిమాను రవితేజతో చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ అమ్మడికి అవకాశాలు రావడానికి చాలా సమయం పట్టింది. రామ్ సరసన సినిమా చేసినా అది కూడా ఫ్లాపైంది. మళ్ళీ సినిమా లేదు. అదే మాళవిక శర్మ యంగ్ హీరో సరసన నటించి తన మొదటి సినిమా చేసి హిట్ కొట్టి ఉంటే కెరీర్ గ్రాఫ్ ఇంకోలా ఉండేదని సినీ లవర్స్ చెప్పుకుంటున్నారు.