టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టారు. బాలయ్యకు ఇది వరుసగా మూడో విజయం. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పాత్ర ఎంత కీలకమో బాలయ్యకు వరుసకు కూతురుగా నటించిన యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల పాత్ర కూడా అంతే. కేవలం శ్రీలీల తన కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి రోల్ లో నటించడం ఆమె అదృష్టం అని చెప్పాలి. ఈ పవర్ ఫుల్ పాత్రలో నటించిన శ్రీలీల ఆ పాత్రలో జీవించేసింది.
ఆమె తన కెరీర్లో ఎన్నో గ్లామర్ పాత్రలు, రొమాంటిక్ పాత్రలలో నటించినా కూడా భగవంత్ కేసరి సినిమాలో పాత్ర ఆమె కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండి పోయేదిగా ఉంటుంది. ఈ సినిమా విజయంతో బాలయ్య మార్కెట్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగింది. విజ్జి పాప రోల్‌లో శ్రీలీల నటన చూసిన టాలీవుడ్ జనాలు అయితే ఆమెకు మెస్మరైజ్ అయిపోతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా సక్సెస్ తో శ్రీలీల కూడా రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో పది సినిమాలు ఉన్నాయి. ఆమె కొత్త కమిట్మెంట్ల కోసం ఇప్పటివరకు తీసుకుంటున్న రెండు నుంచి రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్‌కు అదనంగా మరో కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆమె ఒప్పుకున్న సినిమాల రెమ్యునరేషన్ తక్కువగానే ఉంది. అయితే ఇకనుంచి ఆమె రెమ్యూనరేషన్ మూడు కోట్ల పై మాట.
మూడు నుంచి మూడున్నర కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తేనే శ్రీలీల సినిమాకు కాల్ సీట్లు ఇచ్చేలా కనిపిస్తోంది. ఇక శ్రీలీల కూడా టాలీవుడ్ లో సపరేట్ క్రేజ్ ఉండడంతో ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే శ్రీలీల ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుంటుంది. ఈ విషయంలో ఆమె జాగ్రత్తగా ముందుకు వెళితే ఆమె కెరీర్ కు తిరుగే ఉండదని చెప్పాలి.