సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ.. ఉమనెయిజర్ అనే టాక్ ఉంది. అయితే.. ఆ మాట ఆయన బాలీవుడ్‌కు వెళ్లిపోయాక వచ్చిందే తప్ప.. తెలుగులో ఆయన సినిమాలు చేస్తున్న సమయంలో రాలేదని ఆయన అభిమానులు పేర్కొంటారు. తెలుగులో వర్మ చేసిన సినిమా.. శివ. ఇది అప్పట్లో ఇండస్ట్రీని ఓకుదుపు కుదిపేసింది. ఈ సినిమాలో పరిచయంతోనే అక్కినేని నాగార్జున , అమల నిజ జీవితంలో వివాహం చేసుకున్నారు.
అయితే.. ఇదే సినిమాలో వాస్తవానికి శ్రీదేవిని పెట్టి చేయాలని వర్మ అనుకున్నారట. కానీ శ్రీదేవి బిజీగా ఉండడంతో ఆమెకు కుదరలేదు. ఇదిలావుంటే.. ఆది నుంచి కూడా శ్రీదేవి నటన అంటే.. ఎంతో ఇష్టపడిన వర్మ.. ఆమెను ప్రేమించానని చెప్పుకొనేవారు. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెల్లడించారు. అయితే.. తనప్రేమను శ్రీదేవికి చెప్పుకోలేక పోయినట్టు ఆయన వెల్లడించారు. దీనికి కారణం.. కొన్ని అర్హతలు ఉండాలని వర్మ అనేవారు.
మనిషికి ప్రేమ పుట్టడం సహజం. కానీ, మనం ఇష్టపడేవారికి మనం అందాలంటే.. మనకు కొన్ని అర్హతలు ఉండాలి. వాటిలో కొన్నినాకు లేవు. నా ముఖం చూస్తే.. నాకే అసహ్యమేస్తుంది. ఇక, శ్రీదేవికి ఎలా నచ్చుతుంది. పైగా ఆమె నాకన్నా.. హైట్. ఇప్పుడు చెప్పండి.. ఇది ప్రేమంటారా?
అని తనమీద తనే విమర్శలు గుప్పించుకున్నారు వర్మ.
శ్రీదేవిని ప్రేమించిన వర్మ. వివిధ కారణాలతో ఆమెకు చెప్పలేదు. ముఖ్యంగా ఆయనకు శ్రీదేవి నటన అంటే ఇష్టం. కానీ, ఆమెకు ప్రేమ వెల్లడిస్తే.. ఆమె అంగీకరిస్తే.. ఇండస్ట్రీలోకి ఆమె రాకూడదనేది ఆయన కండిషన్. అయితే.. ఇది సాధ్యం కాదు. అందుకే.. ఆయన చెప్పలేక పోయారు. శ్రీదేవికి ఈ విషయం తెలిసినా.. ఎక్కడా బయటపడలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెలుగులో రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి క్షణ-క్షణం.. రెండు గోవిందా గోవిందా! ఈ రెండు కూడా హిట్టయ్యాయి.